News July 16, 2024
రేషన్ కార్డులు లేని రైతుల పరిస్థితి ఏంటి..?: నిరంజన్ రెడ్డి
రైతు రుణమాఫీకి రేషన్ కార్డు ప్రమాణికంగా తీసుకుంటామని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదమని, మరీ రేషన్ కార్డులు లేని రైతుల పరిస్థితి ఏంటని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. అందరి రుణాలను మాఫీచేస్తామని చెప్పి.. ఇప్పుడుమాత్రం కొందరికే రుణమాఫీ పరిమితం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందన్నారు.
Similar News
News December 22, 2024
NGKL: శ్రీశైలం వెళ్తుండగా యాక్సిడెంట్.. యువకుడి మృతి
NGKL జిల్లాలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు <<14947368>>స్పాట్‌డెడ్<<>> అయ్యారు. స్థానికుల సమాచారం.. గండీడ్ మండల వాసి ఈశ్వర్, సంగారెడ్డికి చెందిన అరవింద్(20) బైక్‌పై శ్రీశైలం వెళ్తున్నారు. మన్ననూరు లింగమయ్య ఆలయం వద్ద అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టారు. అరవింద్ స్పాట్‌లోనే చనిపోయాడు. ఈశ్వర్ తీవ్రంగా గాయపడగా అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదైంది.
News December 21, 2024
కొడంగల్‌ను అభివృద్ధి చేస్తుంటే కుట్రలు: సీఎం రేవంత్
బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. వెనుకబడిన t
కొడంగల్‌ను అభివృద్ధి చేస్తుంటే కుట్రలు చేసి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లగచర్లలో దాడులు చేయించారన్నారు. స్థానికులను రెచ్చగొట్టి అధికారులపై ఉసిగొల్పారని మండిపడ్డారు. అధికారులు ఏం పాపం చేశారని వారిపై దాడులు చేశారని బీఆర్ఎస్ నాయకులను ఆయన ప్రశ్నించారు.
News December 21, 2024
MBNR: చెరువులో పడి తల్లి, ఇద్దరు పిల్లల మృతి
మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలో పోమాల్‌లో శనివారం విషాదం చోటుచేసుకుంది. పోమాల్ గ్రామానికి ఓ తల్లి, ఇద్దరు పిల్లలు చెరువులో పడి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.