News April 11, 2025

రేషన్ కార్డు ఈ కేవైసీలో బాపట్ల జిల్లా ప్రథమ స్థానం

image

రేషన్ కార్డుల ఈ కేవైసీ ప్రక్రియలో బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని పౌర సరఫరా శాఖ అధికారులు గురువారం ప్రకటించారు. బాపట్ల జిల్లాలో మొత్తం 12,90,164 మంది రేషన్ దారులు ఉండగా వారిలో 12,08,479 మంది ఈ కేవైసీ చేయించుకున్నట్లు తెలిపారు. చిన్నారులు, వృద్ధులు కాకుండా 69,202 మంది ఈ కేవైసీ చేయించుకోవాల్సి ఉందన్నారు. రాష్ట్రంలోనే 93.67%తో బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.

Similar News

News November 9, 2025

ములుగులో బాలుడి మృతికి వైద్యుడి నిర్లక్ష్యమే కారణమా?

image

కన్నాయిగూడెం మండలం గూరేవులకు చెందిన హరినాథ్(7) పాముకాటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. బాలుడి మృతికి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. పాముకాటుకు వైద్యుడి పర్యవేక్షణలో యాంటీ డోస్ ఇవ్వాల్సి ఉండగా, ఆ సమయంలో డాక్టర్ అందుబాటులో లేకపోవడం, ఉన్న సిబ్బంది సరైన రీతిలో స్పందించక పోవడంతో ఈ దారుణం జరిగిందని వారు వాపోతున్నారు.

News November 9, 2025

మహిళా జర్నలిస్టులపై ఆన్‌లైన్ హింస సరికాదు: జస్టిస్ సూర్యకాంత్

image

సోషల్ మీడియా లేదా ఆన్‌లైన్ వేదికగా మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న హింసను కాబోయే సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఖండించారు. వారి ప్రతిష్ఠకు హాని కలగకుండా నిర్ధిష్టమైన సెక్యూరిటీ ప్రొటోకాల్ అనుసరించాలని కోరారు. ఢిల్లీలో జరిగిన ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కార్ప్స్ 31వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సాంకేతికతను వాడుకొని వారి ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ, వారిని ట్రోలింగ్ సరైన చర్య కాదని పేర్కొన్నారు.

News November 9, 2025

KNR: కాంగ్రెస్‌లో అయెమయం.. నేతల మధ్య విబేధాలు

image

కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో అయోమయం మొదలైంది. నాయకుల మధ్య విభేదాలు, అగ్రశ్రేణి న్యాయకత్వం వద్ద సమన్వయం లేకపోవడంతో ఇటీవల కరీంనగర్లో జరిగిన అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో ఓటమిపాలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరాల కోసం పార్టీలో చేరిన నాయకులు ఆధిపత్యాన్ని చూపిస్తున్నారు. దీంతో పార్టీని పట్టుకుని ఉన్న పాత కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.