News April 4, 2025
రేషన్ దుకాణంలో వనపర్తి జిల్లా కలెక్టర్ తనిఖీ

పేదలకు నాణ్యమైన సన్న బియ్యం అందించాలనే ఉద్దేశంతోనే, ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గురువారం శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని రేషన్ దుకాణాన్ని సందర్శించి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. అనంతరం రేషన్ దుకాణంలో ఉన్న స్టాక్ రిజిస్టర్, బియ్యం పంపిణీ చేస్తున్న విధానాన్ని పరిశీలించారు.
Similar News
News April 8, 2025
ఆదిలాబాద్‌లో 12ఏళ్ల బాలికపై అత్యాచారం

12ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆదిలాబాద్‌లో వెలుగుచూసింది. DSP జీవన్ రెడ్డి తెలిపిన వివరాలు.. మావల పరిధిలోని ఓ కాలనీకి చెందిన బాలికను ఓ 35ఏళ్ల మహిళ ఆదివారం మధ్యాహ్నం అడవిలోకి తీసుకెళ్లింది. ఆమె బంధువుతో కలిసి అక్కడకు వచ్చిన ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారం చేశారు. బాలిక తల్లికి విషయం చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువకులతో పాటు మహిళ, ఆమె బంధువుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
News April 8, 2025
దిల్‌సుఖ్‌నగర్ బాంబ్ బ్లాస్ట్.. నేడే తీర్పు

దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్లపై ఇవాళ తెలంగాణ హైకోర్టు తుది తీర్పు వెలువరించబోతుంది. 2013 FEB 21న జరిగిన ఈ బాంబ్ దాడిలో 18 మంది మృతి చెందగా, 130 మందికి గాయాలవ్వడం అప్పట్లో దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. నిందితులు యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి NIA కోర్టు ఉరిశిక్ష వేయగా, దీనిపై హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ పేలుళ్ల ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు.
News April 8, 2025
గంజాయి తరలిస్తున్న నలుగురు అరెస్ట్

టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో నలుగురు యువకులు అక్రమంగా గంజాయి తరలిస్తున్నారని సమాచారం ఆధారంగా సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, ఎస్ఐ నాగమల్లేశ్వరావు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 4.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీఐ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వల్ల యువత భవిష్యత్ దెబ్బతింటుందన్నారు. యువత చెడు మార్గాలను వదిలేయాలని సూచించారు.