News April 11, 2025

రేషన్ లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన పొంగులేటి

image

పినపాక నియోజకవర్గం మణుగూరు మండలం కూనవరం గ్రామంలో సన్నబియ్యం పథకం అమలులో భాగంగా లబ్ధిదారుడు వంకా శివలక్ష్మి ఇంట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ శుక్రవారం భోజనం చేశారు. పేదల సంక్షేమం కోసమే ఈ పథకం ప్రారంభించినట్లు చెప్పారు. కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్ పాల్గొన్నారు.

Similar News

News April 18, 2025

ఎన్టీఆర్: ‘MLA సీటు త్యాగం.. పది నెలలుగా ఎదురుచూపులు’

image

మాజీ మంత్రి దేవినేని ఉమ 2024 ఎన్నికలలో తన సిట్టింగ్ మైలవరం స్థానాన్ని వసంత కృష్ణప్రసాద్‌కు ఇచ్చారు. కూటమి గెలుపు అనంతరం ఉమకు MLC, రాజ్యసభ ఎంపీ, నామినేటెడ్ పదవి ఇవ్వనున్నారని వార్తలొచ్చినా చివరికి పదవి దక్కలేదు. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు పదవులు ఇవ్వాల్సి రావడంతో ఉమకు టీడీపీ అధిష్టానం ఇప్పటివరకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. రానున్న రోజుల్లోనైనా ఉమ ఎదురుచూపులకు ఎండ్ కార్డు పడుతుందేమో చూడాలి. 

News April 18, 2025

సిద్దిపేట: కరెంట్ షాక్‌తో బాలుడి మృతి

image

ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి ఆరో తరగతి విద్యార్ధి సాయి ప్రణీత్(12) మృతి చెందిన ఘటన తోగుట మండలం తుక్కాపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామంలోని దేవాలయంలో జరిగే ఉత్సవాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ పోల్‌ను అనుకోకుండా తగలడంతో సాయి ప్రణీత్ అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి తండ్రి స్వామి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 18, 2025

త్వరలో అంతరిక్ష కేంద్రానికి భారత వ్యోమగామి

image

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(IAF) గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా మేలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)కు వెళ్లనున్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. నాసా అనుమతి పొందిన ప్రైవేట్ స్పేస్‌ఫ్లైట్‌లో ఆయన ప్రయాణించనున్నారు. గత 40 ఏళ్లలో స్పేస్‌లోకి వెళ్లిన తొలి ఇండియన్‌గా శుక్లా నిలవనున్నారు. 1984లో తొలిసారి రాకేశ్‌శర్మ స్పేస్‌లోకి వెళ్లారు. ఈ మిషన్ ఇస్రో, నాసా భాగస్వామ్యంలో కీలకంగా మారనుంది.

error: Content is protected !!