News April 6, 2025

రేషన్ లబ్ధిదారుల ఇంట్లో MLA కోమటిరెడ్డి భోజనం

image

చౌటుప్పల్‌: రాష్ట్ర ప్రభుత్వం రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో ప్రజాప్రతినిధులు భోజనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో పంతంగి గ్రామంలో సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు భోజనం చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Similar News

News April 8, 2025

పవన్ కాన్వాయ్ వివాదం.. విశాఖ సీపీ వివరణ

image

AP: Dy.CM పవన్ కాన్వాయ్ వల్ల 30 మంది విద్యార్థులు JEE ఎగ్జామ్ రాయలేకపోయారన్న ఆరోపణలపై విశాఖ CP బాగ్చి స్పష్టతనిచ్చారు. ‘పోలీసుల వల్ల విద్యార్థులకు ఇబ్బంది కలగలేదు. Dy.CM కాన్వాయ్ వల్ల ఆలస్యం అయ్యిందన్న ఆరోపణల్లో నిజం లేదు. మేం ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు పెట్టలేదు. సీసీటీవీ ఫుటేజ్, లేటుగా వచ్చిన విద్యార్థుల ఫోన్లను ట్రాక్ చేశాం. వాళ్లే లేటుగా వచ్చి పోలీసులపై నిందలేస్తున్నారు’ అని వివరణ ఇచ్చారు.

News April 8, 2025

‘రాజాసాబ్’ రిలీజ్‌పై అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజా సాబ్’ మూవీపై డైరెక్టర్ మారుతి ఓ అప్డేట్ ఇచ్చారు. ‘సీజీ వర్క్ కంప్లీట్ కాగానే ‘రాజా సాబ్’ మూవీ విడుదల తేదీని నిర్మాతలు ప్రకటిస్తారు. ఈ సినిమా విడుదలకు మరికొంత సమయం పడుతుంది. అప్పటివరకు కొంచెం ఓపిక పట్టండి. మీ అంచనాలు అందుకునేందుకు మేం తీవ్రంగా శ్రమిస్తున్నాం. మా హార్డ్ వర్క్‌ను చూపించేందుకు ఎదురు చూస్తున్నాం’ అని పేర్కొన్నారు.

News April 8, 2025

బాన్సువాడ: గుండెపోటుతో హోంగార్డు మృతి

image

బాన్సువాడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న సాయిలు(55) గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన సోమవారం విధులు నిర్వహించి స్వగ్రామమైన దేశాయిపేట్‌లోని ఇంటికి వెళ్లారు. తరువాత ఛాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హోంగార్డు సాయిలు మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు.

error: Content is protected !!