News September 30, 2025

రేషన్ షాపులకు అక్టోబర్ నెల రేషన్ సరుకుల రాక

image

అనంతపురం జిల్లాలోని 6,62,014 రైస్ కార్డుదారులకు సరిపడా నిత్యావసర సరుకులు 1645 చౌక ధరల దుకాణాలకు కేటాయించామని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ తెలిపారు. ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ షాపుల వద్దనే బియ్యం కార్డుదారులకు సరఫరా చేస్తామని వెల్లడించారు.

Similar News

News September 30, 2025

కలెక్టర్ ఆనంద్ మార్క్.. అధికారుల్లో దడ!

image

అనంతపురం (D) కలెక్టర్ ఆనంద్ తనదైన మార్క్ చూపిస్తూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులకు వణుకు పుట్టిస్తున్నారు. ‘మార్పు రావాల్సిందే. లేకుంటే మార్చేస్తా’ అంటూ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ఇటీవల ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో బాలుడు మృతిచెందడంతో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వైద్యులను వెంటనే సస్పెండ్ చేశారు. అలాగే తన క్యాంపు కార్యాలయంలో వ్యక్తిగత సిబ్బందిని సైతం 9 నుంచి ముగ్గురికి తగ్గించడం విశేషం.

News September 29, 2025

అర్జీలు స్వీకరించిన అనంతపురం కలెక్టర్

image

అనంతపురంలోని కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను అర్జీల రూపంలో కలెక్టర్‌కు అందజేశారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి అర్జీలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్ఓ మలోల పాల్గొన్నారు.

News September 28, 2025

ధన్, ధాన్య కృషి యోజనలో అనంతపురం జిల్లా ఎంపిక

image

PM ధన్, ధాన్య కృషి యోజన కింద దేశంలోని 100 ఆశావహ వ్యవసాయ జిల్లాల్లో అనంతపురం ఎంపికైనట్లు MP అంబికా లక్ష్మీనారాయణ ఆదివారం తెలిపారు. PM మోదీ, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌, CM చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు పంట ఉత్పాదకత తక్కువగా ఉండడం, తక్షణ రుణాల పంపిణీ పరిమితంగా ఉండడం వంటివి ఆధారంగా తీసుకున్న నిర్ణయం మంచిపరిణామమన్నారు.