News August 20, 2024
రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్న ప్రతిపక్షాలు: మంత్రి పొన్నం

హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రతిపక్షాలు రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని, రాష్ట్రంలో రైతాంగం ఆందోళన చెందవద్దు అని కోరారు. రైతు రుణమాఫీ అందరికీ చేస్తామని తెలిపారు. ఎవరికైనా రుణమాఫీ కాకపోతే మండల కార్యాలయాల్లో, వ్యవసాయ అధికారులను కలిసి అప్లికేషన్ ఇవ్వాలని కోరారు.
Similar News
News February 28, 2026
మెదక్: ఇన్‌ఛార్జ్ మంత్రిని కలిసిన కలెక్టర్!

మెదక్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామిని కలెక్టర్ ప్రతిమా సింగ్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మూడు రోజుల క్రితమే కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె, మంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. ప్రభుత్వంపై నమ్మకం వమ్ము చేయకుండా బాధ్యతలు నిర్వర్తిస్తానని కలెక్టర్ తెలిపారు.
News February 28, 2026
మెదక్: రాష్ట్ర స్థాయి ‘MUN’ పోటీలకు 11 మంది ఎంపిక!

మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి ‘మోడల్ యునైటెడ్ నేషన్స్’ (MUN) పోటీల్లో ప్రతిభ చాటిన 11 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. 56 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలకు ఎంఈవో శంకర్, హెచ్‌ఎంలు శ్రీనివాస్ రెడ్డి తదితరులు జడ్జిలుగా వ్యవహరించారు. విజేతలను డీఈవో విజయ, ఏఎంవో సుదర్శన్ మూర్తి అభినందించారు.
News February 28, 2026
మనోహరాబాద్: లింగారెడ్డిపేటలో చిరుత కలకలం!

లింగారెడ్డిపేట గ్రామ శివారులో చిరుత దాడిలో రెండు దూడలు మృత్యువాత పడ్డాయి. రైతులు ఆకుల సుధాకర్, బామని ఐలయ్యకు చెందిన పశువులపై చిరుత దాడి చేయడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, పాదముద్రల ఆధారంగా ఆనవాళ్లను సేకరించారు.


