News September 6, 2025

రైతాంగ సమస్యలపై 9న అన్నదాత పోరు: వైసీపీ

image

వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే.రాజు ఆధ్వర్యంలో శనివారం అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరించారు. యూరియా కొరత, గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం రైతులను బిచ్చగాళ్లుగా మార్చిందని ఆయన విమర్శించారు. ఈనెల 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత పోరు నిర్వహించనున్నట్టు తెలిపారు.

Similar News

News September 6, 2025

SIIMA అవార్డు అందుకున్న మాధవధార హీరో

image

దుబాయ్ వేడుకగా జరిగిన SIIMA అవార్డులో మాధవధారకు చెందిన హీరో పేడాడ సందీప్ సరోజ్‌కు అవార్డు లభించింది. కమిటీ కుర్రోలు చిత్రంతో పేడాడ సందీప్ సరోజ్ ప్రేక్షకుల్ని అలరించాడు. ఈ చిత్రానికి గానూ బెస్ట్ డెబ్యూట్ యాక్టర్‌గా అవార్డు అందుకున్నాడు. ఆయనకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు అభినందనలు తెలిపారు. సందీప్ సరోజ్ తల్లి రమణకుమారి విశాఖ జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.

News September 6, 2025

స్టీల్ ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి

image

స్టీల్ ప్లాంట్‌లో కాంట్రా‌క్ట్ కార్మికుడు శనివారం మృతి చెందాడు. పెద గంట్యాడ నడుపూర్‌కు చెందిన సీహెచ్ అప్పలనాయుడు సీడీసీపీ డిపార్ట్‌మెంట్లో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు 30 అడుగుల ఎత్తు నుంచి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కార్మికులు ఆసుపత్రికి తరలించారు. స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 6, 2025

ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు.. రైల్వే శాఖ వివరణ

image

విశాఖ-దువ్వాడ మధ్య గురువారం ఉదయం రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి ఎదురెదురుగా వచ్చాయన్న వార్తపై రైల్వే శాఖ స్పష్టత ఇచ్చింది. సంబంధిత మార్గంలో ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ సిస్టమ్‌ అమర్చబడి ఉందని, ఈ విధానం ప్రకారం రైళ్ల రాకపోకలు క్రమబద్ధంగా జరుగుతాయని వివరించింది. కొన్నిసార్లు రైళ్లు దగ్గరగా వెళ్ళినట్లుగా కనిపించవచ్చని, ఇది ఆందోళన చెందాల్సిన విషయం కాదని రైల్వే శాఖ పేర్కొంది.