News February 6, 2025

రైతును ఆత్మహత్యకు ప్రేరేపించినవారిపై అట్రాసిటీ కేసు

image

మదనపల్లె మండలం, పిచ్చలవాండ్లల్లెలో రైతు నరచంహులు పొలానికి దారి వదలలేదని రెండు రోజుల క్రితం ఉరేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. రైతు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించిన వారిపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ కొండయ్య నాయుడు, తాలూకా సీఐ కళా వెంకటరమణ బుధవారం తెలిపారు. ఇప్పటికే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయగా, దళిత సంఘాలు ఆందోళనకు దిగడంతో దారి లేకుండాచేసిన వారిపై ఈకేసు అయింది.

Similar News

News February 6, 2025

కడప: భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య

image

భార్య కాపురానికి రాలేదని వ్యక్తి ఆత్మహ్యతకు పాల్పడిన ఘటన జమ్మలమడుగు మండలంలో చోటు చేసుకుంది. జమ్మలమడుగు సీఐ లింగప్ప తెలిపిన వివరాల మేరకు.. గూడెంచెరువు గ్రామానికి చెందిన చెన్నప్ప, వరలక్ష్మి దంపతులు. సంక్రాంతి పండగకు సత్యసాయి జిల్లా ముదిగుబ్బ(M) పాలెం గ్రామానికి వెళ్లిన భార్య తిరిగి ఇంటికి రాలేదు. కాగా బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చెన్నప్ప ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

News February 6, 2025

రాజన్న సిరిసిల్ల: మహిళ ఫొటోలు, వీడియోలు తీసిన వ్యక్తి అరెస్ట్..

image

స్నానం చేస్తుండగా మహిళ ఫొటోలు, వీడియోలు చిత్రీకరించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు కోనరావుపేట ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని కనగర్తి గ్రామానికి చెందిన బత్తుల అంజయ్య ఓ మహిళ స్నానం చేస్తుండగా తన సెల్ ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు తీశాడని బాధిత మహిళ పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మహిళా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.

News February 6, 2025

హరీశ్ రావుకు హైకోర్టులో ఊరట

image

గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలో ఈ కేసును కొట్టి వేయాలని హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. ఈనెల 12 వరకు అరెస్టు చేయొద్దని అధికారులను ఆదేశించింది.

error: Content is protected !!