News August 19, 2025

రైతులకు అవసరమైన ఎరువులు సమయానికి అందించాలి: కలెక్టర్

image

జిల్లాలో ఎరువుల కొరత రాకుండా పటిష్ట పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మహాముత్తారం మండల పర్యటనలో భాగంగా కలెక్టర్ ఎరువుల లభ్యత, స్టాకు వివరాలను వ్యవసాయ శాఖ ఏవో అనూషను అడిగి తెలుసుకున్నారు. రైతులకు అవసరమైన ఎరువులు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని, ఎరువుల పంపిణీలో పారదర్శకత పాటించాలని కలెక్టర్ సూచించారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత పాటించాలన్నారు.

Similar News

News August 19, 2025

16 సర్కిళ్ల SE, DE ఆపరేషన్, DE టెక్నికల్స్‌తో CMD వీడియో కాన్ఫరెన్స్

image

హనుమకొండలోని TGNPDCL కార్యాలయంలో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి 16 సర్కిళ్ల SE, DE ఆపరేషన్, DE టెక్నికల్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతేడాది నుంచి పోల్స్‌పై ఉన్న కేబుల్ వైర్లు తొలగించమని కేబుల్ ఆపరేటర్లకు విన్నవించినా పట్టించుకోవట్లేదని, విద్యుత్ ప్రమాదాల జరుగుతున్నాయన్నారు. అందుకు అనుగుణంగా కేబుల్ వైర్లు రీ-అలైన్‌మెంట్ చేసుకోవాలని లేదంటే తొలగించాలని ఎస్ఈలను ఆదేశించారు.

News August 19, 2025

JNTUలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీలు

image

అనంతపురం జేఎన్టీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి ECE (4), CSE (3), సివిల్స్ (2), ఇంగ్లిష్ (1), ఫిజిక్స్ (1) ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగష్టు 20వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ”principal.cea@jntua.ac.in” కు తమ బయోడేటాను పంపాలని ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి తెలిపారు. ఇందుకు పీజీ అర్హత ఉంటే చాలు. ఇంటర్వ్యూ తేదీలను త్వరలో ప్రకటించనున్నారు.

News August 19, 2025

సాదియా బేగానికి బంగారు పతకం

image

పరిగి నియోజక‌వర్గానికి చెందిన డీఎస్టీవో నసీరుద్దీన్ పెద్ద కుమార్తె సాదియా బేగానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంఏ ఇంగ్లిష్‌లో 2023- 24 ఓయూ టాపర్‌గా నిలిచింది. మంగళవారం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నారు. ఈమె పదో తరగతి పరిగి గొంసలొ గార్సియా ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో చదివి వికారాబాద్ జిల్లా టాపర్‌గా నిలిచింది.