News August 19, 2025
రైతులకు ఆందోళన అవసరం లేదు: జనగామ డీఏఓ

యూరియా కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి (DAO) అంబికా సోని తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతుల అవసరాలకు అనుగుణంగా పంపిణీ జరుగుతోందని తెలిపారు. అవసరానికి మించి ఎరువును నిల్వచేసుకోవద్దని సూచిస్తూ, ప్రతి రైతుకు సకాలంలో యూరియా అందేలా చర్యలు తీసుకుంటున్నామని DAO వివరించారు.
Similar News
News August 19, 2025
మాదకద్రవ్యాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

సమాజాన్ని నిర్వీర్యం చేసే మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పి.రంజిత్ భాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్ భవనంలో నార్కోటిక్స్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారులతో కలిసి “డ్రగ్స్ వద్దు బ్రో” పోస్టర్లను ఆవిష్కరించారు. జేడ్పీ సీఈఓ నాసర రెడ్డి, కమిషనర్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
News August 19, 2025
సుదర్శన్ రెడ్డి ఎంపికకు కారణమిదేనా?

విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా <<17451888>>బి.సుదర్శన్‌రెడ్డి<<>> ఎంపిక వ్యూహాత్మక నిర్ణయమని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయేతర వ్యక్తిని బరిలో దింపడంతో NDAతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలను ఇరకాటంలో పెట్టినట్లైందంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని TDP, YSRCP, BRS పార్టీలపై ఒత్తిడి తెచ్చేందుకే తెలుగు వ్యక్తిని ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. సుదర్శన్‌రెడ్డి CM చంద్రబాబుకు సన్నిహితుడు కావడం గమనార్హం.
News August 19, 2025
సిద్దిపేట: ఇంటిని జాకిలతో పైకి ఎత్తేశారు !

టెక్నాలజీ ఉపయోగించుకుంటే అన్ని సాధ్యమే అన్నట్టుంది. సిద్దిపేటలో టైర్లు మార్చుకునేందుకు ఉపయోగించే జాకీలతో ఇంటిని పైకెత్తారు. వివరాల్లోకి వెళితే సిద్దిపేటకు చెందిన ఆరుట్ల యాదవరెడ్డి 15ఏళ్ల క్రితం ఇల్లు నిర్మించగా ఇప్పుడు అది రోడ్డుకు సమాంతరంగా ఉంది. దీంతో ఇంటిని 3 నుంచి 5 ఫీట్లు ఎత్తు పెంచేందుకు ఓ కన్సెక్షన్‌ను సంప్రదించగా 15 మంది కూలీల సాయంతో 100 జాకీలతో పని మొదలు పెట్టి ఇంటిని పైకి లేపారు.