News March 5, 2025
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్

మనుబోలు మండలంలోని మనుబోలు రైతు సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూముల రీసర్వే ప్రక్రియ పర్యవేక్షణకు మనుబోలు మండలానికి వచ్చిన ఆయన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ధాన్యం తేమశాతం, కొనుగోలు కేంద్రం రికార్డులను పరిశీలించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
Similar News
News March 6, 2025
నెల్లూరు: ‘సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కాదు అమ్మాయిల బ్రోకర్’

నెల్లూరుకు చెందిన ఓ యువతికి ఆమె తల్లిదండ్రులు మ్యాట్రీమోని ద్వారా పెళ్లి సంబంధాలు చూస్తుండగా.. విజయవాడకు చెందిన అమీర్‌ఖాన్ పరిచయమయ్యాడు. తాను సాఫ్ట్‌వేర్ ఉద్యోగినని నమ్మించి రూ.15 లక్షల నగదు, 13 సవర్ల బంగారు కట్నకానుకుల కింద తీసుకున్నాడు. ఈ క్రమంలో భర్త అమీర్‌ఖాన్ అమ్మాయిల బ్రోకర్ అని తెలియడంతో భార్య ప్రశ్నించగా.. దాడి చేశాడు. ఆమె నెల్లూరు చిన్నబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News March 6, 2025
అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తాం: మంత్రి నారాయణ

అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. బుధవారం మంత్రి జిల్లా కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రూ.64 వేల కోట్లతో 5000 ఎకరాలలో రాజధాని నిర్మిస్తామని, ఇప్పటికే రూ.50 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్ పాల్గొన్నారు.
News March 6, 2025
నెల్లూరు: 7న చికెన్ & ఎగ్ మేళా

ఈ నెల 7వ తేదీన నెల్లూరు వి.ఆర్.సి గ్రౌండ్‌లో చికెన్ & ఎగ్ మేళాను నిర్వహిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖాధికారి కె. రమేశ్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కే. కార్తీక్ ముఖ్య అతిథులుగా కానున్నారు. కోళ్ల ఫారం యజమానులు, చికెన్, కోడిగుడ్ల వ్యాపారులు ఈ సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. బర్డ్ ఫ్లూ గురించి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు.