News August 30, 2024
రైతులకు నిరాశ.. తగ్గిన అన్ని రకాల మిర్చి ధరలు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే ఈరోజు అన్ని రకాల మిర్చి ధరలు పడిపోయాయి. గురువారం క్వింటా తేజ మిర్చి ధర రూ.18,000 పలకగా.. నేడు రూ.17,500 పలికింది. అలాగే 341 రకం మిర్చి నిన్న రూ.14,600 పలకగా నేడు రూ.14,000కి తగ్గింది. మరోవైపు వండర్ హాట్ మిర్చి(WH)కి నిన్న రూ.15వేల ధర రాగా ఈరోజు రూ.14,500కి చేరింది.
Similar News
News November 26, 2024
వరంగల్: భారీగా తగ్గిన పత్తి ధర
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు పత్తి భారీగా తరలి వచ్చింది. అయితే ధర మాత్రం నిన్నటితో పోలిస్తే భారీగా తగ్గింది. సోమవారం క్వింటా కొత్త పత్తి ధర రూ.6,860 పలకగా.. నేడు రూ.6770కి పడిపోయింది. ధరలు భారీగా పడిపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగేలా చూడాలని అధికారులను కోరుతున్నారు.
News November 26, 2024
దుగ్గొండి: వ్యవసాయ బావిలో పడి గొర్రెల కాపరి మృతి
దుగ్గొండి మండలంలో గొర్రెల కాపరి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. దేశాయిపల్లి గ్రామానికి చెందిన కాపరి కోట మల్లయ్య అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ వ్యవసాయ భూమి వద్ద గొర్రెల మంద పెట్టాడు. సోమవారం రాత్రి అక్కడ ఉన్న తన కుమారుడికి ఇంటి నుంచి టిఫిన్ బాక్స్ తీసుకుని వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మల్లయ్య మృతి చెందినట్లు చెప్పారు.
News November 26, 2024
వరంగల్‌లో పెరిగిన చలి.. జాగ్రత్త!❄
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చలి విపరీతంగా పెరిగింది. 4 రోజుల క్రితమే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తగ్గినట్లు HYD వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు చలి గాలులు వీస్తున్నాయి. ఇక అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు మంచు అలుముకుంటోంది. శ్వాసకోస సమస్యలు ఉన్నవారు ఈ సమయాల్లో బయటకురాకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. జాగ్రత్త! SHARE IT