News April 24, 2025
రైతులకు భూ భారతి భరోసా: WGL కలెక్టర్

పట్టేదారు రైతు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించి వారికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని కలెక్టర్ సత్య శారద దేవి అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భూ భారతి అవగాహన సదస్సులో చట్టంపై రైతులకు వివరించారు. రెవెన్యూ రికార్డులు ఏమన్నా లోటుపాట్లు ఉంటే భూభారతిలో సరిచేసుకునే అవకాశం ఉందన్నారు. దీనిపై అవగాహన పెంచుకొని రైతులందరూ వినియోగించుకోవాలన్నారు.
Similar News
News December 14, 2025
నల్లబెల్లి ఆసక్తికర పోరు.. తల్లిపై కూతురు విజయం

వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మండల కేంద్ర పంచాయతీ పరిధి నాలుగో వార్డులో జరిగిన ఎన్నికల్లో తల్లిపై కూతురు విజయం సాధించారు. ఈ సమరంలో తల్లి సరోజనపై కూతురు సౌజన్య స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ 120 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బీఆర్ఎస్ మద్దతుతో బరిలోకి దిగిన సౌజన్య గెలుపు ఆ పార్టీకి బలమైన ఉత్సాహాన్ని ఇచ్చిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
News December 14, 2025
శివాజీ నగర్ సర్పంచ్‌గా సుక్కినే నాగరాజు

జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఫలితాలు వెలువడుతున్నాయి. దుగ్గొండి మండలం శివాజీ నగర్‌లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సుక్కినే నాగరాజు 92 ఓట్లతో విజయం సాధించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆయన అనుచరులు సంబరాలు జరుపుకొంటున్నారు.
News December 14, 2025
వరంగల్: 18.82% పోలింగ్ @9AM

స్థానిక సంస్థల ఎన్నికల రెండో దశలో పోలింగ్ వరంగల్ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు మొత్తం 18.82 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లు క్యూలో నిల్చొని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాగా, దుగ్గొండి, నల్లబెల్లి, గీసుకొండ, సంగెం మండలాల్లో నేడు పోలింగ్ జరుగుతోంది.


