News March 25, 2025

‘రైతులకు సాగు లాభాలు పెంచడమే లక్ష్యంగా పని చేయాలి’

image

రైతులకు సాగు లాభాలు పెంచడమే లక్ష్యంగా పని చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్, వైరా కృషి విజ్ఞాన్ కేంద్రంలో నిర్వహించిన మధ్య తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా సంఘం సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక మంది రైతులు వరిపై ఆధారపడడం మంచిది కాదని చెప్పారు. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

Similar News

News March 28, 2025

రైల్వేబోర్డు చైర్మన్‌ను కలిసిన ఖమ్మం ఎంపీ

image

ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి రైల్వే బోర్డు ఛైర్మన్ సతీష్ కుమార్‌ను ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డోర్నకల్- మిర్యాలగూడ, డోర్నకల్- గద్వాల రైల్వే లైన్ అలైన్మెంట్ గురించి వివరించారు. పలు సమస్యలు, సూచనలు తెలపగా రైల్వే బోర్డు ఛైర్మన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.

News March 28, 2025

ఇల్లందు సింగరేణిలో పవన్ కళ్యాణ్ మూవీ షూటింగ్

image

ఇల్లందు సింగరేణి జేకే 5 ఓసీలో గురువారం పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ జరిగింది. సినిమాలోని పలు సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. చిత్ర యూనిట్ సభ్యులతో సింగరేణి ప్రాంగణమంతా కోలాహలం నెలకొంది. సింగరేణి యాజమాన్యం షూటింగ్‌ను పర్యవేక్షించింది.

News March 28, 2025

నత్తనడకన LRS ఫీజు చెల్లింపు ప్రక్రియ

image

ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన రాయితీ గడువు ముంచుకొస్తోంది. ఈ నెల 31తో రాయితీ గడువు ముగియనుంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 35వేల కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. జిల్లాలో 1,00,800 మంది దరఖాస్తు చేయగా 7,829 మంది మాత్రమే సొమ్ములు చెల్లించారు. దరఖాస్తులకు ఫీజు చెల్లింపు ప్రక్రియ నత్తనడకన కొనసాగుతుండడం గమనార్హం.

error: Content is protected !!