News March 2, 2025
రైతులతో మాట్లాడిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్

భామిని మండలం బత్తిలి గ్రామంలో జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ శనివారం సందర్శించి అక్కడ రైతులతో మాట్లాడారు. వ్యవసాయంలో పార్వతీపురాన్ని ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దేందుకు అజోలా యూనిట్లను పెంచుతున్నామని అన్నారు. రైతులు పత్తి పంటను తగ్గించి మొక్కజొన్న, వరి పంటలపై దృష్టి సారించాలని సూచించారు. అధికారులు ఉన్నారు.
Similar News
News November 7, 2025
‘కూటమిగా పోరాడదాం.. మెంటాడను సాధిద్దాం’

మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలో కొనసాగించేకు ఉమ్మడిగా పోరాడాలని జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు అన్నారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన నాయకులు సమావేశం అయ్యారు. మెంటాడ మండలం పార్వతీపురం జిల్లాలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. త్వరలో మండల ప్రజల అభిప్రాయాలను ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులకు తెలియజేస్తామన్నారు.
News November 7, 2025
భారత్ స్వర్గధామంలాంటి ఆశ్రయం ఇచ్చింది: హసీనా

బంగ్లాదేశ్‌లోని యూనస్ ప్రభుత్వంలో తీవ్రవాదులకు మద్దతునివ్వడం వల్ల ఇండియాతో సంబంధాలు దెబ్బతింటాయని ఆదేశ ex-PM షేక్ హసీనా అన్నారు. అవామీ లీగ్‌పై నిషేధంతో తన మద్దతుదారులు రానున్న ఎలక్షన్లో పాల్గొనే అవకాశం లేదని చెప్పారు. మైనారిటీలు దాడులకు గురవుతున్నారన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై కోర్టుకు ఆధారాలు సమర్పిస్తానన్నారు. భారత్ తనకు స్వర్గధామంలాంటి ఆశ్రయాన్ని కల్పించిందని ప్రశంసించారు.
News November 7, 2025
విశాఖ కలెక్టరేట్లో వందేమాతరం వేడుకలు

విశాఖ కలెక్టరేట్లో శుక్రవారం ఉదయం వందేమాతరం గీతాన్న ఆలపించారు. బంకించందర చటర్జి వందేమాతరాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులతో పాటు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఉన్నతాధికారితో కలిసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. వందేమాతర గీతం స్వతంత్ర్య స్ఫూర్తిని నింపిందని పేర్కొన్నారు.


