News April 29, 2024
రైతులను నిలబెట్టాలని నాలుగైదు కార్యక్రమాలు చేశాం: కేసీఆర్
అశోక్ గులాటీ ఆగ్రో ఎకానమిస్ట్‌తో అనేక మాసాలపాటు చర్చించి ఓ నిర్ణయం తీసుకొని రైతులను నిలబెట్టాలని నాలుగైదు కార్యక్రమాలు చేశామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. సోమవారం రోడ్‌షోలో భాగంగా ఖమ్మం కార్నర్ మీటింగ్‌లో పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వంలో రైతుబంధు ఇచ్చామని, కరెంటు, నీటి తీరువా లేకుండా చేశామని, పాత బకాయిలు రద్దు చేశామని, ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నామని పేర్కోన్నారు.
Similar News
News November 26, 2024
కొత్తగూడెం ఎయిర్పోర్డుపై కేంద్ర మంత్రి కీలక ప్రకటన
తెలంగాణలో విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. కొత్తగూడెం విమానాశ్రయ ఏర్పాటుకు అనువైన స్థలం ఉందని సీఎం తమ దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. త్వరలోనే కొత్తగూడేనికి సాంకేతిక బృందాన్ని పంపించనున్నట్లు చెప్పారు. కొత్తగూడెంతో పాటు వరంగల్ విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటు చేసే సంకల్పంతో ఉన్నట్లు చెప్పారు.
News November 26, 2024
‘ఉచిత కోచింగ్ కోసం ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలి’
విదేశాలకు వెళ్లి చదవాలనుకునే మైనార్టీ విద్యార్థుల కోసం IELTS, GRE, TOFEL పరీక్షలకు తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ HYD ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కె.సత్యనారాయణ తెలిపారు. ఆసక్తి, అర్హత గల జిల్లా మైనార్టీ అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈనెల 30 లోపు తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ HYD లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News November 26, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు ∆} పాల్వంచ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} పినపాక నియోజకవర్గం లో ఎమ్మెల్యే పాయం పర్యటన ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద పర్యటన ∆} పలు శాఖల అధికారులతో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం ∆} బయ్యారంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు