News March 28, 2025
రైతులను ప్రోత్సహించండి: కలెక్టర్

జిల్లాలో అధికంగా వినియోగించే సన్న రకాల వరి పంటల సాగు విస్తీర్ణం పెంచేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమైన కలెక్టర్ రానున్న ఖరీఫ్, రబీ సీజన్లలో పండించాల్సిన వరి పంటలపై పలు సూచనలు చేశారు. సన్న రకం వరి వంగడాల సాగుపై రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News March 30, 2025
పండగలు మన దేశ సంస్కృతిలో భాగం – CM

పండగలు భారతదేశ సంస్కృతిలో భాగమని సీఎం చంద్రబాబు అన్నారు. ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో నిర్వహించిన ఉగాది సంబరాల్లో ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమాజ బాగు కోసం తపనపడే వ్యక్తి అని కితాబు ఇచ్చారు. ట్రస్ట్ నడపడం అంటే సాధారణ విషయం కాదని, స్వర్ణ భారత్ ట్రస్ట్ యువతలో స్ఫూర్తిని నింపుతోందన్నారు.
News March 30, 2025
విజయవాడ దుర్గమ్మ ప్రసాదంలో మేకు

విజయవాడ ఇంద్ర కీలాద్రి అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. అమ్మవారి ప్రసాదంలో మేకు వచ్చిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. భక్తుల వివరాల మేరకు.. కొందరు భక్తులు శుక్రవారం అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. అనంతరం వారు మహా మండపం కింద 4 వ ప్రసాదం కౌంటర్‌లో పులిహోర పొట్లాలు కొనుగోలు చేశారు. వారు ప్రసాదం తింటుండగా మేకు రావడంతో అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
News March 30, 2025
కృష్ణా: UG పరీక్షా ఫలితాలు విడుదల

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన UG 3వ, 5వ సెమిస్టర్ పరీక్షల రీ వాల్యుయేషన్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.