News March 22, 2025
రైతులు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి: జేసీ

జిల్లాలో 90 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. వాటిని రైతులు వినియోగించుకోవాలని కోరారు. కందులకు రూ.7,550, శనగలకు రూ.5,650, మినుములకు రూ.7,400 చొప్పున కనీస మద్దతు ధర ప్రకటించామన్నారు. బహిరంగ మార్కెట్‌లో కనీస మద్దతు ధర కంటే తక్కువ ఉన్నప్పుడు కొనుగోలు కేంద్రాలలో తమ ధాన్యాన్ని రైతులు విక్రయించి, ప్రభుత్వ కనీసం మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.
Similar News
News March 23, 2025
ఒంగోలు: పెళ్లి అయిన 9 రోజులకే మృతి

పెళ్లి అయిన 9 రోజులకే డాక్టర్ మృతి చెందిన విషాద ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలుకు చెందిన శివాచారి(32) డాక్టర్ చదువుకుని పెదకాకాని మండలంలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులు ఈనెల 13న లావణ్యతో వివాహం చేశారు. రెండు రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. వెంటనే విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
News March 23, 2025
చీమకుర్తి: లంచం తీసుకుంటూ దొరికిన ప్రిన్సిపల్

తన పాఠశాలలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే సిబ్బందికి జీతం అందాలంటే ప్రిన్సిపల్‌కి కొంత డబ్బులు సమర్పించుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో అటెండర్‌గా పనిచేసే వ్యక్తి నుంచి రూ.17,500 లంచం తీసుకుంటుండగా, ఏసీబీ డీఎస్పీ శిరీష, చీమకురి ఎస్టీ గురుకుల ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్‌ని శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.
News March 23, 2025
కనిగిరి: బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపనకు లోకేశ్.. ఎప్పడంటే.!

AP ప్రభుత్వం క్లీన్, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 500 బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు కోసం రిలయన్స్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా.. ప్రకాశం జిల్లాలో పీసీపల్లి మండలంలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. 500 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్ నిర్మాణానికి మంత్రి నారా లోకేశ్ ఏప్రిల్ 2న శంకుస్థాపన చేస్తారు.