News November 20, 2025
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు: కలెక్టర్ సత్యప్రసాద్

మల్లాపూర్ మండలం ముత్యంపేటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నిర్వాహకులను ఆయన ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు జాప్యం జరగకుండా చూడాలన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, తహశీల్దార్ రమేశ్ గౌడ్, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 24, 2025
నల్గొండ సర్కారు దవాఖానలో వసూళ్ల పర్వం కలకలం..!

నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో వసూళ్ల పర్వం కలకలం రేపుతోంది. ఇక్కడ పనిచేస్తున్న కొందరు అధికారులు, ఉద్యోగులపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా.. ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఈ దవాఖానలోని పరిపాలన విభాగంలో ఇద్దరు ఉద్యోగులపై ఆరోపణలు వెల్లువెత్తడంతో కలెక్టర్ ఇలా త్రిపాఠి వారిపై విచారణ చేసి ఈనెల 26 లోగా నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు.
News November 24, 2025
నిజామాబాద్: స్థానిక పోరుకు సిద్ధమా..!

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కోసం అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. తాజాగా నిజామాబాద్ జిల్లా ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటించారు. ఈ మేరకు జిల్లాలోని 31 మండలాల్లోని 545 GPలు, 5022 వార్డులు, 5053 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 8,51,417 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళా ఓటర్లు 4,54,621 మంది, పురుషులు 3,96,778 మంది, ఇతరులు 18 మంది ఉన్నారు.
News November 24, 2025
ఏలూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన వివరాలు ఇవే

ఏలూరు జిల్లాలో సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలను జిల్లా అధికారులు తెలిపారు. 11:30 నిమిషాలకు కొయ్యలగూడెం మండలం రాజవరం చేరుకుని పొంగుటూరు-లక్కవరం రోడ్డు పనులను పరిశీలిస్తారు. 12 గంటలకు ఐఎస్ జగన్నాథపురంలోని లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12.45 నిమిషాలకు మ్యాజిక్ ట్రైన్ పరిశీలిస్తారని వెల్లడించారు.


