News March 28, 2025
రైతులు పరిహారం సద్వినియోగించుకోవాలి: VKB కలెక్టర్

ప్రభుత్వం అందజేస్తున్న నష్టపరిహారాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్‌లో కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేటకు సంబంధించిన పట్టా భూమి కలిగిన రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సమ్మతి తెలిపిన రైతులకు తాండూర్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్‌లతో కలిసి నష్ట పరిహార చెక్కులను జిల్లా కలెక్టర్ అందజేశారు.
Similar News
News November 7, 2025
నైట్ షిఫ్ట్ ఒత్తిడి తట్టుకోలేక 10 మందిని చంపేసిన నర్సు!

నైట్ షిఫ్టులతో విసుగు చెందిన ఓ నర్సు (Male) హైడోస్ ఇంజెక్షన్లు ఇచ్చి 10 మందిని చంపిన ఘటన జర్మనీలోని వుయెర్సెలెన్ ఆసుపత్రిలో జరిగింది. పని ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఇలా చేసినట్లు అతడు ఒప్పుకోవడంతో కోర్టు జీవిత ఖైదు విధించింది. అతడు మరో 27 మందిని హత్యాయత్నం చేసినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై పూర్తి దర్యాప్తు కొనసాగుతోంది. కాగా గతంలో నిల్స్ హెగెల్ అనే మరో నర్సు కూడా 85 మందిని హత్య చేశాడు.
News November 7, 2025
కొత్తగూడెం: సింగరేణి డిపెండెంట్లకు శుభవార్త

ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్ కృషితో సింగరేణి కారుణ్య నియామక అభ్యర్థులకు శుభవార్త అందింది. మెడికల్ టెస్టులు పూర్తయి ఇప్పటివరకు నియామక పత్రాలు పొందని దాదాపు 473 మంది డిపెండెంట్లకు ఈ నెల 12న డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు. దీని ద్వారా సింగరేణి వ్యాప్తంగా 473 కార్మిక కుటుంబాలకు న్యాయం జరగనుంది.
News November 7, 2025
సినిమా అప్డేట్స్

* మమ్ముట్టి నటించిన ‘భ్రమయుగం’ అరుదైన ఘనత సాధించింది. లాస్‌ఏంజెలిస్‌లోని ‘అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్’లో వచ్చే ఏడాది FEB 12న ప్రదర్శితమవనుంది.
* పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించిన ‘విలాయత్ బుద్ధ’ మూవీ ఈ నెల 21న రిలీజవనుంది.
* దివంగత మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా హాలీవుడ్‌లో ‘మైఖేల్’ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో ఆయన సోదరుడు జెర్మైన్ జాక్సన్ కుమారుడు జాఫర్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు.


