News August 25, 2025
రైతులే నిల్వ చేస్తున్నట్లు తెలుస్తోంది: కలెక్టర్

జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని, జిల్లాకు సరిపడా యూరియా ఇప్పటికే అందుబాటులో ఉందని కలెక్టర్ అంబేడ్కర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు 36 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా 32 వేల మెట్రిక్ టన్నుల వరకు పంపిణీ చేశామన్నారు. మరో 3 వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని తెలిపారు. భవిష్యత్తు అవసరాల కోసం రైతులే నిల్వ చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు.
Similar News
News August 25, 2025
విజయనగరం: ‘60% పెరిగిన మహిళా ప్రయాణికులు’

విజయనగరం జిల్లాలో స్త్రీ శక్తి పథకం ప్రారంభించిన తొలివారం 3,26,939 మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారని జిల్లా ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి తెలిపారు. నాలుగు రకాల బస్సుల్లో మొత్తం 6,17,206 మంది ప్రయాణించగా.. వారిలో వీరిలో 3,26,939 మంది మహిళలు ఉన్నారన్నారు. టికెట్లు తీసుకుని ప్రయాణించిన పురుషులు 2,90,499 మంది ఉన్నారు. మహిళా ప్రయాణికుల సంఖ్య 60% పెరిగినట్లు ఆమె తెలియజేశారు.
News August 25, 2025
VZM: ప్రతి నెల 3వ శుక్రవారం ఎంప్లాయిస్ గ్రీవెన్స్

ప్రతి నెల 3వ శుక్రవారం ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామని కలెక్టర్ అంబేడ్కర్ సోమవారం తెలిపారు. ఎంప్లాయిస్ గ్రీవెన్స్ సెప్టెంబరు 19న కలెక్టరేట్లో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఉద్యోగులు తమ సమస్యలపై ఈ గ్రీవెన్స్‌లో ధరఖాస్తులను అందజేయవచ్చునని సూచించారు.
News August 25, 2025
రానున్న మూడు రోజులు భారీ వర్షాలు: కలెక్టర్

బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడిన దృష్ట్యా రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు. పిజిఆర్ఎస్ అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాలకు పంట నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, చెరువులు, కాల్వల గట్లు పటిష్టంగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మండల స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.