News August 10, 2025
రైతుల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం: అచ్చెన్నాయుడు

రైతుల అభ్యున్నతి, వ్యవసాయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం కోటబొమ్మాళి మండలం నిమ్మడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో రైతు అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. జిల్లాలోని రైతులకు రూ.186 కోట్లు అన్నదాత సుఖీభవ నిధులు అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పాల్గొన్నారు.
Similar News
News August 12, 2025
శ్రీకాకుళం జిల్లాకు వర్షసూచన

శ్రీకాకుళం జిల్లాలో బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు మంగళవారం తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతులు, ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో ఉండొద్దన్నారు. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
News August 12, 2025
నులి పురుగులను నిర్మూలిద్దాం: జిల్లా కలెక్టర్

నులిపురుగులను నులిమేద్దామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్లో జరిగిన మాత్రల పంపిణీని కలెక్టర్ ప్రారంభించారు. నులిపురుగుల వలన పిల్లలు రక్తహీనతతో నీరస పడతారని వివరించారు. శారీరక, మానసిక, ఎదుగుదల లోపం వస్తుందన్నారు. పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీలలో మాత్రలు పంపిణీ చేయాలన్నారు.
News August 12, 2025
మరోసారి తండ్రైన రామ్మోహన్ నాయుడు

కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుటుంబంలో సందడి నెలకొంది. రామ్మోహన్ దంపతులకు మంగళవారం ఉదయం కుమారుడు జన్మించాడు. ఇప్పటికే ఒక కుమార్తె ఉండగా తాజాగా కుమారుడు జన్మించడంతో కుటుంబసభ్యులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.