News September 10, 2025

రైతుల కోసం అగ్రికల్చర్ వాట్సాప్ ఛానల్ ప్రారంభం

image

రాష్ట్ర వ్యవ‌సాయశాఖ కొత్తగా వాట్సప్ ఛానెల్ ను ప్రారంభించింది. అగ్రిక‌ల్చర్ డిపార్టుమెంట్ తెలంగాణ పేరుతో గ‌త నెల 8న అందుబాటులోకి తెచ్చింది. నెల రోజుల్లోనే దాదాపు 35 వేల మంది రైతులు ఫాలోవర్స్ గా ఉన్నారు. దీని ద్వారా ఎప్పటిక‌ప్పుడు తెలంగాణ రైతాంగానికి కీల‌క‌మైన స‌మాచారం, స‌ల‌హాలు, సూచ‌న‌ల‌ను వ్యవ‌సాయ శాఖ అందిస్తోంది. జగిత్యాల జిల్లాలో మెత్తం 2,48,550 మంది రైతులు ఉండగా, 4,18,569 ఎకరాల సాగుభూమి ఉంది.

Similar News

News September 10, 2025

HYD: కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి జాతర: మంత్రి

image

జూబ్లీహిల్స్‌లో BRS గెలిచినా లాభం లేదని, ప్రభుత్వం మారదని, ఓటర్లంతా కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈరోజు HYDలో KTR వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి జాతర సాధ్యమని, BRSఎన్నికల్లో బీరు-బిర్యానీ సంస్కృతి తెచ్చిందన్నారు. జూబ్లిహిల్స్‌లో చిన్న శ్రీశైలం యాదవ్ ఇంటిని కూల్చింది KTR కాదా అని ప్రశ్నించారు. పదేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు.

News September 10, 2025

సంగారెడ్డి: ‘సంక్షేమ పథకాల అమల్లో బ్యాంకుల పాత్ర కీలకం’

image

సంక్షేమ పథకాల అమలులో బ్యాంకుల పాత్ర కీలకమని అదనపు కలెక్టర్ మాధురి అన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అన్ని ప్రాధాన్య రంగాలకు రుణాలు ఇవ్వాలని పేర్కొన్నారు. రైతులకు వెంటనే పంట రుణాలను మంజూరు చేయాలని సూచించారు. సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ నర్సింగ రావు పాల్గొన్నారు.

News September 10, 2025

PHOTO GALLERY: ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’

image

AP: కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక టీడీపీ-బీజేపీ-జనసేన అనంతపురంలో బహిరంగ సభ నిర్వహించాయి. ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ పేరుతో జరిగిన ఈ సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ స్టేట్ చీఫ్ మాధవ్ పాల్గొన్నారు. గత 15 నెలల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమం ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.