News April 6, 2024

రైతుల గురించి కొప్పుల 30 నిమిషాలు ఆలోచించలేదు: విప్

image

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 31 గంటల దీక్ష చేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్.. ధర్మపురి రైతుల గురించి ఎప్పుడైనా 30 నిమిషాలైనా ఆలోచించారా అని ధర్మపురి ఎమ్మెల్యే,  ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. శుక్రవారం ధర్మపురిలో మీడియాతో మాట్లాడారు. తన ఎమ్మెల్యే పదవి కాలం ముగిసే లోపు ధర్మపురిలో రిజర్వాయర్ ఏర్పాటు చేసి సస్యశ్యామలం చేస్తామన్నారు. కాంగ్రెస్ మండల నాయకులు పాల్గొన్నారు.

Similar News

News November 6, 2025

కరీంనగర్: TNGO జిల్లా కార్యవర్గ సమావేశం

image

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీఎన్జీవో జిల్లా కార్యాలయంలో ఈరోజు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆవేదన, పెన్షన్ సమస్య, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఆలస్యం, ఉద్యోగులపై జరుగుతున్న దాడులు, 317 జీవో ప్రభావం వంటి అనేక కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కార్యదర్శి సంగేం లక్ష్మణరావు, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఓంటేల రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

News November 6, 2025

మానకొండూర్: జ్యోతి వెలిగించి స్పోర్ట్స్ మీట్ ప్రారంభించిన కలెక్టర్

image

మానకొండూరు మండలం దేవంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో 11వ జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ 2025 అట్టహాసంగా ప్రారంభమైంది. కలెక్టర్ పమేలా సత్పతి జ్యోతి వెలిగించి ఈ స్పోర్ట్స్ మీట్‌‌ను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రతిభ పాఠవాలను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు.

News November 5, 2025

ఎల్లుండి కరీంనగర్‌కు గవర్నర్.. కలెక్టర్ మీటింగ్

image

నవంబర్ 7న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కరీంనగర్ జిల్లా పర్యటన నేపథ్యంలో కలెక్టర్ నిన్న సమావేశం నిర్వహించారు. శాతవాహన యూనివర్సిటీ స్నాత్సకోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో అవసరమైన పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి జిల్లాధికారులను ఆదేశించారు. గవర్నర్ పర్యటనలో ప్రొటోకాల్ పాటిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తును ఏర్పాటు చేసి సమయపాలన పాటించాలని ఆమె సూచించారు.