News January 22, 2025
రైతుల ప్రధాన సమస్యలపై నివేదిక తయారు చేస్తాం: సత్యవతి

జనవరి 24 నుంచి ఫిబ్రవరి చివరి వారం వరకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పర్యటిస్తామని మాజీ మంత్రి, MLC సత్యవతి రాథోడ్ తెలిపారు. రైతు ఆత్మహత్యలు, రైతు భరోసా, రైతు రుణమాఫీ పేరిట కాంగ్రెస్ చేసిన దగా, సాగునీటీ కష్టాలు, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను తెలుసుకొని ఒక నివేదిక తయారు చేస్తామన్నారు. రైతు ఆత్మహత్యలపై ఏర్పాటుచేసిన BRS అధ్యయన కమిటీ ఆధ్వర్యంలో తొలి సమావేశంలో సత్యవతి పాల్గొన్నారు.
Similar News
News July 6, 2025
నిజామాబాద్‌లో సందడి చేసిన నటి అనసూయ

నిజామాబాద్ నగరంలో నటి అనసూయ ఆదివారం సందడి చేసింది. హైదరాబాద్ రోడ్డులోని ఓ షాప్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. పలు పాటలకు స్టెప్పులు వేసి ఉర్రూతలూగించారు. ఆమె మాట్లాడుతూ.. నిజామాబాద్‌కు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇందూరులో తనకు ఇంత మంది అభిమానులు ఉండటం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు.
News July 6, 2025
శ్రీకాకుళం: మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనాలు పెంచాలి

మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వేతనాలు పెంచి వారి సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీకాకుళంలోని సీఐటీయూ కార్యాలయంలో ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల, స్కూల్ స్వీపర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. మెనూ ఛార్జీలు ఒక్కొక్క విద్యార్థికి కనీసం రూ.20/-లు ఇవ్వాలని కోరారు. గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు.
News July 6, 2025
అకౌంట్లలోకి రూ.2వేలు.. పడేది అప్పుడేనా?

PM కిసాన్ సమ్మాన్ నిధి కింద 20వ విడత సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనే ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 18న నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈనెల 20న PM మోదీ బిహార్‌లో పర్యటించనున్న నేపథ్యంలో దానికి 2 రోజుల ముందే PM కిసాన్ నిధులు విడుదల చేసే ఛాన్స్ ఉందని జాతీయ మీడియా పేర్కొంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ పథకం కింద ఏటా 3 విడతల్లో ₹6వేలు అందిస్తోన్న సంగతి తెలిసిందే.