News July 3, 2024

రైతు ఆత్మహత్య వెనుక ఎవరున్నా ఉపేక్షించం: డిప్యూటీ సీఎం భట్టి

image

ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఘటనపై విచారణకు ఆదేశించామని, బాధ్యులు ఎవరైనా ఉపేక్షించేది లేదని అయన స్పష్టం చేశారు. ఇక త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామని భట్టి వెల్లడించారు. ఐదేళ్లలో కనీసం రూ.లక్ష కూడా రుణమాఫీ చేయని బీఆర్ఎస్ ఇప్పుడు తమను ప్రశ్నించడం విడ్డూరమని ఆయన మండిపడ్డారు.

Similar News

News November 30, 2024

శబరిమలకు వెళ్లి నేలకొండపల్లి వాసి మృతి

image

ఖమ్మం జిల్లాలో విషాదం నెలకొంది. అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లి వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాలు ప్రకారం.. నేలకొండపల్లి మండల చెన్నారానికి చెందిన శనగాని వెంకన్న అయ్యప్ప స్వామి మాల ధరించి ఇరుముడి సమర్పించేందుకు శబరిమల వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో రక్తపు వాంతులు, విరోచనాలు అయ్యాయి. గమనించిన తోటి అయ్యప్ప స్వాములు వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.

News November 30, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నేటి ముఖ్యాంశాలు

image

∆} వివిధ శాఖల అధికారులతో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం ∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు ∆} సత్తుపల్లి మండలంలో మంచినీటి సరఫరా బంద్ ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఖమ్మంలో ప్రజా విజయోత్సవాల కార్యక్రమం ∆} పినపాకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన

News November 30, 2024

ఖమ్మం: వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజుల సెలవు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు అధికారులు రెండు రోజుల సెలవులు ప్రకటించారు. శనివారం, ఆదివారం వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉండనుంది. అనంతరం సోమవారం మార్కెట్ తిరిగి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. కావున ఖమ్మం జిల్లా రైతులు గమనించి తమకు సహకరించాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అధికారులు కోరారు.