News April 8, 2025
రైతు బజార్‌లో తగ్గింపు ధరలో బియ్యం, కందిపప్పు

విశాఖలో బియ్యం, కందిపప్పు ట్రేడర్స్, టోకు వ్యాపారాలతో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ మంగళవారం ధరలపై సమీక్ష చేశారు. బహిరంగ మార్కెట్లో వీటి ధర ఎక్కువగా ఉందని రైతు బజార్‌లో తక్కువ రేటుకే ఇవ్వనున్నట్లు తెలిపారు. విశాఖలో గాజువాక, ములగాడ, ఎంవీపీ, కంచరపాలెం, మధురవాడ, పెద్ద వాల్తేర్ రైతు బజార్లలో కందిపప్పు కేజీ రూ.104, రా రైస్ కేజీ రూ.44, స్టీమేడ్ రైస్ కేజీ రూ.45కు అమ్మనున్నట్లు తెలిపారు.
Similar News
News April 17, 2025
విశాఖ: తీవ్రంగా గాయపడిన నాగరాజు మృతి

కోటవురట్ల మండలం కైలాసపట్నం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జల్లూరు నాగరాజు (58) KGHలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య 9కి చేరింది. కోటవురట్ల శివారు రాట్నాలపాలెం గ్రామానికి చెందిన నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు ప్రమాదకరమైన బాణసంచా తయారీ కేంద్రంలో పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
News April 17, 2025
గాజువాక యువకుడిని కాపాడిన పోలీసులు

గాజువాకకు చెందిన సన్యాసినాయుడు రాజమండ్రిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు రక్షించారు. రాజమండ్రి త్రీటౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. సన్యాసినాయుడు రాజమండ్రిలో పోటీ పరీక్షలకు సిద్ధమౌతున్నాడు. కాగా బెట్టింగులకు బానిసై రూ.50వేలు పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రులకు విషయం చెప్పలేక బుధవారం రాజమండ్రిలోని పుష్కరఘాట్ వద్ద గోదావరిలో దూకాడు. అది గమనించిన పోలీసులు స్థానికుల సాయంతో యువకుడిని కాపాడారు.
News April 17, 2025
విశాఖలో రెచ్చిపోతున్న చైన్ స్నాచర్స్

విశాఖలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. పగటి పూటే ఇంట్లోకి చొరబడి దొచుకుంటున్నారు. మద్దిలపాలెంలో మంగళవారం సాయంత్రం అద్దె ఇంటికోసం అని వచ్చి మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన ఘటన మర్చిపోకముందే MVP కాలనీలో బుధవారం సాయంత్రం మరో ఘటన జరిగింది. MVP సెక్టార్-8లో లలిత అనే వృద్ధురాలి మెడలో గొలుసు తెంపుకొని ఓ దుండగుడు పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో MVP పోలీసులు కేసు నమోదు చేశారు.