News April 23, 2025
రైతు బిడ్డకు 465 మార్కులు

గుత్తి మండల పరిధిలోని కొత్తపేట గ్రామానికి చెందిన రైతు లక్ష్మీనారాయణ, రజిని దంపతుల కుమారుడు రేశ్వంత్ తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటాడు. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదివిన యువకుడు ఎంపీసీలో 470కు గానూ 465 మార్కులు సాధించాడు. యువకుడిని రైతులు, ఉపాధ్యాయులు, బంధువులు, స్నేహితులు అభినందించారు.
Similar News
News April 23, 2025
10th RESULTS: మూడో స్థానంలో విశాఖ జిల్లా

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో విశాఖ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 28,435 మంది పరీక్ష రాయగా 25,346 మంది పాసయ్యారు. 15,045 మంది బాలురులో 13,288(88.32%) మంది, 13,390 మంది బాలికలు పరీక్ష రాయగా 12,058(90.05%) మంది పాసయ్యారు. 89.14 పాస్ పర్సంటైల్‌తో విశాఖ జిల్లా 3వ స్థానంలో నిలిచింది. గతేడాది 8వ స్థానంలో నిలవగా ఈసారి ఐదు స్థానాలు మెరుగుపడింది.
News April 23, 2025
టెన్త్ ఫలితాల్లో 13వ స్థానంలో నెల్లూరు జిల్లా

టెన్త్ ఫలితాల్లో నెల్లూరు జిల్లా 13వ స్థానంలో నిలించింది. మొత్తం 28,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 23,633 మంది పాస్ అయ్యారు. 14,142 మంది అబ్బాయిలకుగాను 11,510 మంది, అమ్మాయిలు 14,133 మందికిగాను 12,123 మంది పాస్ అయ్యారు. కాగా 83.58 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
News April 23, 2025
10th Results :17వ స్థానంలో నంద్యాల జిల్లా

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో నంద్యాల జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 24,496 మంది పరీక్ష రాయగా 20,051 మంది పాసయ్యారు. 12,702 మంది బాలురులో 10,097 మంది, 11,794 మంది బాలికలు పరీక్ష రాయగా 9,954 మంది పాసయ్యారు. 81.85 పాస్ పర్సంటేజ్‌తో నంద్యాల జిల్లా 17వ స్థానంలో నిలిచింది.