News January 25, 2025
రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి: జనగామ కలెక్టర్

రైతు భరోసా పథకం కింద కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం వచ్చిన రైతులు, ఇంతకు ముందే పాసు పుస్తకం కలిగి ఉండి కూడా దరఖాస్తు చేసుకోని వారు ఈ నెల 31లోగా ఏఈవోల వద్ద దరఖాస్తు చేసుకోవాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. అలాగే బ్యాంకు ఖాతా వివరాల్లో మార్పులు, చేర్పులు చేసుకోవాలనుకునే వారు సైతం దరఖాస్తు చేసుకోవాలన్నారు. గతంలో రైతుబంధు పొందిన రైతులు మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు.
Similar News
News March 1, 2026
బిచ్కుంద: 24 గంటల్లోనే హత్య కేసు నిందితుడి అరెస్ట్

భూ తగాదాల నేపథ్యంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. బిచ్కుంద CI రవి తెలిపిన వివరాలు.. బిచ్కుందకు చెందిన సాయిలు, అతని సోదరుడు నారాయణ మధ్య కొంతకాలంగా భూ వివాదాలు నడుస్తున్నాయి. ఆగ్రహానికి లోనైన నారాయణ సాయిలు తలపై కర్రతో బలంగా బాదాడు. తీవ్ర గాయాలైన సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు నారాయణను పట్టుకొని, హత్యకు వాడిన కర్రను స్వాధీనం చేసుకున్నట్లు CI వెల్లడించారు. SI రాజు ఉన్నారు.
News March 1, 2026
నిజామాబాద్ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు

నిజామాబాద్ మీదుగా వెళ్లే పలు రైళ్లు నిర్వహణ పనుల కారణంగా పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు తెలిపారు. మార్చి 7వ తేదీ వరకు రద్దు చేశారు. కాచిగూడ – నిజామాబాద్ (77601), నిజామాబాద్ – కాచిగూడ (77602), నిజామాబాద్ – నాందేడ్ (77645), నాందేడ్ – నిజామాబాద్ (77646) రైళ్లు రద్దయ్యాయి.
News March 1, 2026
MNCL: ‘రాయితీపై డ్రోన్ల కొరకు దరఖాస్తు చేసుకోవాలి’

మంచిర్యాల జిల్లాలో రాయితీపై డ్రోన్ల కొరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ తెలిపారు. 2025- 26 సంవత్సరానికి గాను జిల్లాకు 10 వ్యవసాయ డ్రోన్లను కేటాయించినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ ఆదేశాలతో మంచిర్యాల డివిజన్ కు 3, చెన్నూర్ కు 3, బెల్లంపల్లికి 2, భీమినికి 2 డ్రోన్లు కేటాయించామన్నారు. తెలిపారు. ఈ డ్రోన్లను 40 శాతం (రూ.4 లక్షల) రాయితీపై అందించనునట్లు తెలిపారు.


