News August 24, 2025
రైలులో తరలిస్తున్న మాదకద్రవ్యాలు స్వాధీనం

రైలులో అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాలను ఈగల్ సెల్ బాపట్ల టీం సభ్యులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం బాపట్ల రైల్వే స్టేషన్ నుంచి పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో ఈగల్ సెల్, రైల్వే పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. రైలులో అక్రమంగా తరలిస్తున్న ఎనిమిది కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశామన్నారు.
Similar News
News August 25, 2025
ఈ సమయాల్లో నీరు తాగితే?

శరీరానికి అత్యవసరమైన వాటిలో నీరు ఒకటి. రోజుకు 3-4 లీటర్ల నీళ్లు తాగితే ఎన్నో రోగాలను ముందుగానే నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
✒ నిద్ర లేవగానే గోరు వెచ్చని నీరు తాగితే టాక్సిన్స్(వ్యర్థాలు)ను బయటకు పంపుతుంది. ✒ భోజనానికి ముందు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ✒ స్నానానికి ముందు నీరు తాగితే బీపీ నియంత్రణలో ఉంటుంది. ✒ నిద్రకు ముందు తాగితే హార్ట్ ఎటాక్, స్ట్రోక్ నుంచి రక్షణ కలుగుతుంది.
News August 25, 2025
నిజామాబాద్: జిల్లాకు రెండు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ కళాశాలలు

NZB జిల్లాకు మైనారిటీ గురుకుల విద్యా సంస్థల(టెమ్రిస్) ఆధ్వర్యంలో 2 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) కళాశాలలు మంజూరయ్యాయి. ఈ మేరకు టెమ్రిస్ కార్యదర్శి షఫీయుల్లా ఉత్తర్వులు జారీ చేశారు. ఒకటి బాలుర కోసం నాగారంలో, మరొకటి బాలికల కోసం ధర్మపురి హిల్స్‌లోని మదీనా ఈద్గాలో ఏర్పాటు చేశారు. ఈ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు టెమ్రిస్ ఉమ్మడి జిల్లా అధికారి బషీర్ తెలిపారు.
News August 25, 2025
దక్షిణాఫ్రికా పేరిటే ఆ రికార్డు

వన్డేల్లో అత్యధిక సార్లు 400+ రన్స్ చేసిన జట్టుగా దక్షిణాఫ్రికా(8) పేరిట రికార్డు ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో టీమ్ ఇండియా(7), ఇంగ్లండ్(6), <<17503678>>ఆస్ట్రేలియా<<>>(3), NZ(2), SL(2), జింబాబ్వే(1) ఉన్నాయి. చిత్రమేమిటంటే వెస్టిండీస్, PAK, బంగ్లాదేశ్ ఒక్కసారి కూడా ఈ మార్క్ అందుకోలేకపోయాయి. మరోవైపు ఆస్ట్రేలియాపై అత్యధిక వన్డే సిరీస్‌లు(సిరీస్‌లో కనీసం 3 వన్డేలు) గెలిచిన జట్టుగా సౌతాఫ్రికా(9) రికార్డు నెలకొల్పింది.