News January 1, 2026
రైలు బోగీలను ఇలా వేగంగా గుర్తించొచ్చు

రైలు ప్రయాణంలో మన దృష్టిని ఆకట్టుకునేవి కోచ్‌ల రంగులు. ప్రతి కలర్‌కు ఒక అర్థం ఉంటుంది. నీలం రంగు స్లీపర్, ఏసీ, చైర్‌కార్ కోచ్‌లను సూచిస్తుంది. ఎరుపు రంగు రాజధాని వంటి హైస్పీడ్ ఏసీ రైళ్లకు వాడతారు. ఆకుపచ్చ రంగు గరీబ్‌రథ్ రైళ్లకు వేస్తారు. ఇక పసుపు, తెలుపు చారల కోచ్‌లు అన్‌రిజర్వ్డ్, పార్సిల్ వంటి బోగీలను సూచిస్తాయి. ఈ రంగులు ప్రయాణికులకు త్వరగా బోగీని గుర్తించడంలో సహాయపడతాయి.
Similar News
News January 1, 2026
మారింది డేటే.. ‘మిరాకిల్’ మీ చేతుల్లోనే

క్యాలెండర్‌లో మారింది డేట్ మాత్రమే. మీ జీవితం కూడా మారాలని కోరుకుంటున్నారా? అది మీ చేతుల్లోనే ఉంది. బలమైన ఆశయం, సంకల్పం, శ్రద్ధతో పని చేస్తే ఆలస్యమైనా విజయం మిమ్మల్ని చేరక తప్పదు. ఇయర్ మారింది.. మన టైమ్ కూడా మారుతుందని ఊరికే ఉంటే ఇంకో ఇయర్ వచ్చినా డేట్‌లో మార్పు తప్ప జీవితంలో కూర్పు ఉండదు. సో.. నేర్పుగా వ్యవహరిస్తే ‘మిరాకిల్’ మీ చేతుల్లోనే..
ALL THE BEST
News January 1, 2026
ఇవాళ బంగారం, వెండి ధరలెలా ఉన్నాయంటే?

న్యూఇయర్ వేళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.170 పెరిగి రూ.1,35,060కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.150 ఎగబాకి రూ.1,23,800 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,000 తగ్గి రూ.2,56,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News January 1, 2026
చేపల్లో శంకుపూత వ్యాధి – నివారణకు సూచనలు

తెల్ల చేపల్లో శంకుపూత వ్యాధి శీతాకాలంలో వస్తుంది. దీని వల్ల చేపల ఎదుగుదల లోపిస్తోంది. దీని నివారణకు ఎకరా చేపల చెరువులో 80-100 kgల ఉప్పును చల్లాలని మత్స్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. వ్యాధి ఉద్ధృతి ఎక్కువగా ఉంటే ఎకరా చేపల చెరువుకు కాపర్ సల్ఫేట్ ఒక KG చల్లాలి. చేపల పెరుగుదల బాగుండాలంటే ఎకరాకు పిల్లల మోతాదు 3 వేలకు మించకూడదు. 100KGల తవుడుకు 30-40KGల చెక్క కలిపి మేతగా ఇస్తే చేపల పెరుగుదల బాగుంటుంది.


