News January 6, 2026
రైల్‌వన్ యాప్‌తో టికెట్లపై డిస్కౌంట్

ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. రైల్‌వన్ యాప్ ద్వారా అన్‌రిజర్వుడ్ టికెట్లు కొనుగోలు చేస్తే 3% ప్రత్యేక డిస్కౌంట్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ జనవరి 14 నుంచి జులై 14 వరకు అమల్లో ఉంటుంది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రైల్‌వన్ యాప్ ద్వారా రిజర్వుడు, అన్‌రిజర్వుడ్‌తో పాటు ప్లాట్‌ఫాం టికెట్లు కూడా సులభంగా పొందవచ్చన్నారు.
Similar News
News February 2, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News February 2, 2026
ఐసీసీ U19 వన్డే వరల్డ్ కప్: భారత్, అఫ్గాన్ మధ్య సెమీఫైనల్

ఐసీసీ U19 వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై 58 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-2 నుంచి భారత్, ఇంగ్లండ్ సెమీస్‌కు అర్హత సాధించాయి. గ్రూప్-1 నుంచి ఆసీస్, అఫ్గానిస్థాన్ సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. ఫిబ్రవరి-3న జరిగే తొలి సెమీఫైనల్‌లో ఆసీస్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఫిబ్రవరి 4న భారత్, అఫ్ఘాన్ మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది.
News February 2, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (FEB 02, సోమవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.36 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.12 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.26 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


