News November 18, 2025
రైల్వేకోడూరు: ఎంతో ఆశపడ్డారు.. అంతలోనే విషాదం

రైల్వేకోడూరు(M) కొండారెడ్డిపోడుకు చెందిన విజయ్ దంపతుల జీవితం <<18318250>>విషాదంగా <<>>ముగిసింది. HYDలో విజయ్‌కు రూ.లక్షల్లో జీతం. వివాహమై 8ఏళ్లు అయినా పిల్లలు లేరని బాధపడ్డారు. IVF పద్ధతి ద్వారా అతని భార్య గర్భం దాల్చడం, కవలలు అని తేలడంతో చాలా సంతోష పడ్డారు. ఆ చిన్నారులు బయటకు వచ్చే క్షణాలకు ఎదురు చూశారు. ప్రసవ సమయంలో భార్యతో పాటు పిల్లలు చనిపోయారు. అది తట్టుకోలేని విజయ్ ఉరేసుకోవడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
Similar News
News November 18, 2025
డిజిటల్ అరెస్ట్ వ్యవస్థ లేదు: SP జానకి షర్మిల

చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే వ్యవస్థ లేదని SP జానకి షర్మిల అన్నారు. వీడియో కాల్, వాట్సాప్, ఫోన్ ద్వారా ఎవరైనా “మీరు కేసులో ఉన్నారు” “మీరు అరెస్టులో ఉన్నారు” అని బెదిరిస్తే ప్రజలు నమ్మవద్దన్నారు. వ్యక్తిగత, బ్యాంక్, OTP, UPI, ఆధార్, వివరాలు తెలపవద్దన్నారు. డబ్బులు అడిగితే వెంటనే కాల్ కట్ చేయాలని, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు లేదా https://www.cybercrime.gov ఫిర్యాదు చేయాలని సూచించారు.

BIG BREAKING: లొంగుబాటులో మావో చీఫ్

మావోయిస్టులకు సంబంధించి Way2Newsకు కీలక సమాచారం అందింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విజయవాడలో అరెస్టైన మావోయిస్టుల్లో 9 మంది దేవ్ జీ సెక్యూరిటీ అని AP ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా వెల్లడించారు. దీంతో తన గార్డులతో పాటు దేవ్ జీ లొంగిపోయి ఉంటారని తెలుస్తోంది. దీనిపై కొద్ది గంటల్లో అధికార వర్గాల నుంచి ప్రకటన రావచ్చు.