News March 20, 2025
రైల్వేకోడూరు ఎమ్మెల్యే కాలుకు గాయం

రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు మధ్య నిర్వహించిన క్రీడా పోటీల్లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరవ శ్రీధర్ పాల్గొన్నారు. బుధవారం కబడ్డీ ఆడుతూ ఆయన కింద పడిపోయారు. కిందపడిన ఆయనకు కాలు ఫ్రాక్చర్ అయింది. దీంతో శ్రీధర్‌ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాలు ఫ్రాక్చర్ తీవ్రత గురించి తెలియాల్సి ఉంది.
Similar News
News November 5, 2025
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 పోస్టులు

<
News November 5, 2025
కర్నూలు జిల్లాలో SIల బదిలీలు: SP

కర్నూలు జిల్లాలో SIల బదిలీలు చేపట్టినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మంగళవారం బదిలీల ఉత్తర్వులు జారీ చేశారు. గూడూరు SI అశోక్‌ను కర్నూలు తాలూకా PSకు, SI ఎం.తిమ్మయ్యను కర్నూలు 3 టౌన్ నుంచి కర్నూలు 2 టౌన్‌కు, SI జి.హనుమంత రెడ్డిని 2 టౌన్ నుంచి గూడూరుకు, SI ఏసీ పీరయ్యను కర్నూలు తాలూకా PS నుంచి కర్నూలు 3 టౌన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News November 5, 2025
ఉసిరి దీపాన్ని ఎలా తయారుచేసుకోవాలి?

కార్తీక మాసంలో ఉసిరి దీపం పెట్టడం అత్యంత పవిత్రమైన ఆచారం. ఈ దీపాన్ని వెలిగించడానికి గుండ్రని ఉసిరికాయను తీసుకుని, దాని మధ్య భాగంలో గుండ్రంగా కట్ చేయాలి. ఆ భాగంలో స్వచ్ఛమైన నూనె లేదా ఆవు నెయ్యి వేయాలి. ఆ నూనెలో వత్తి వేసి వెలిగించాలి. ఇలా ఉసిరి దీపాన్ని వెలిగించడం వల్ల సకల దేవతల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నవగ్రహ దోషాలు తొలగి ఇంట్లో సుఖశాంతులు చేకూరుతాయని భక్తుల నమ్మకం.


