News June 4, 2024
రైల్వే కోడూరు: అరవ శ్రీధర్ విజయం

రైల్వే కోడూరు జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ విజయం సాధించారు. ఈయనకు మొత్తం 77701 ఓట్లు పోలవ్వగా.. వైసీపీ అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసుకి 67002 ఓట్లు సాధించారు. దీంతో శ్రీధర్ 10699 ఓట్లతో ఘన విజయం సాధించారు. మొదటి సారి ఆయన విజయం సాధించారు. అంతేకాకుండా ఉమ్మడి కడప జిల్లాలో జనసేన జెండా ఎగురవేశారు.
Similar News
News February 22, 2026
తిరుపతి: B.Ed విద్యార్థిని సూసైడ్

తిరుపతి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రైల్వే కోడూరులోని రంగనాయకులపేటలో B.Ed చదువుతున్న ఆమంచి భార్గవి (24) ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి పద్మ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు SI లక్ష్మీ ప్రసాద్‌రెడ్డి తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News February 22, 2026
ఎర్రగుంట్ల: రాత్రి రైలు ఎక్కి.. ఉదయానికి మిస్సింగ్

మచిలీపట్నం నుంచి ధర్మవరం వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో శనివారం ఉదయం ముక్కా ధనలక్ష్మి (25) అదృశ్యమైంది. ఈ మహిళ నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం గురువిమానిపల్లెకి చెందిన జగదీశ్వర్‌రెడ్డి భార్య. ఇరువురు విజయవాడలో శుక్రవారం రాత్రి రిజర్వేషన్ బోగీలో ఎక్కారు. తెల్లవారేసరికి తన భార్యలేదని భర్త ఎర్రగుంట్ల రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News February 21, 2026
కడప జిల్లాలో ఆ కుటుంబం శకం ముగియనుందా?

బద్వేల్లో 60 ఏళ్లుగా బిజి వేముల వీరారెడ్డి కుటుంబం పాలకవర్గం లేదా ప్రతిపక్షంలో ఉంటూ వస్తోంది. అయితే బద్వేల్ రిజర్వ్‌డ్‌లోకి వెళ్లడంతో వారు సపోర్ట్ చేసిన వ్యక్తి ఓడిపోతూ వస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఇన్‌ఛార్జ్‌గా ఉన్న రితేశ్ రెడ్డిని తప్పించి DCCB ఛైర్మన్ సూర్యనారాయణ రెడ్డికి ఇన్‌ఛార్జ్ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే 60 ఏళ్ల తర్వాత ఆ కుటుంబం కథ ముగుస్తుందనే చెప్పవచ్చు.


