News March 27, 2025
రైల్వే కోడూరు: గంగమ్మ జాతరలో విషాదం

రైల్వే కోడూరు పట్టణంలో జరుగుతున్న బలిజపల్లి గంగమ్మ జాతరలో విషాదం చోటుచేసుకుంది. కొత్త కోడూరు గంగమ్మ ఆలయ వ్యవస్థాపకుడు ప్రధాన ధర్మకర్త చెన్నం శెట్టి కుమార్ డప్పులు వాయిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుమార్ మృతితో కొత్తకోటలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News July 7, 2025
చింతపల్లి: పాఠశాల పైకప్పుపై టార్పాలిన్ కవర్లు

చింతపల్లి మండలం చౌడురాయిలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. వర్షాలు కురిసినప్పుడు తరగతి గదులు, వరండాల్లో వాన నీటితో నిండిపోతుంది. ఇలా నీటిలోనే విద్యార్థులు విద్యను అభ్యసించడంతో తల్లిదండ్రులు పైకప్పుపై టార్పాలిన్ కవర్లను వేసి సమస్యను తాత్కాలికంగా పరిష్కరించారు. సుమారు 30 ఏళ్ల క్రితం పాఠశాల భవనం నిర్మించారని, మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు.
News July 7, 2025
కాకినాడ JNTUకు కొత్త అధికారులు

కాకినాడ జేఎన్టీయూ ఇన్‌ఛార్జ్ రెక్టార్, రిజిస్ట్రార్‌లను నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. యూసీఈకే ఈఈఈ విభాగంలో పనిచేస్తున్న శ్రీవినాసరావు ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న సుబ్బారావు ఇన్‌ఛార్జ్ రెక్టార్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు వారిని వీసీ ప్రసాద్ అభినందించారు.
News July 7, 2025
ఉమ్మడి నల్గొండలో డీసీసీ పదవులకు తీవ్ర పోటీ.!

ఉమ్మడి NLG జిల్లా రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. తాజాగా జిల్లాలో DCC అధ్యక్ష పదవులపై ఉత్కంఠ నెలకొంది. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో DCC కీలకం కానుండటంతో పదవుల కోసం నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల నుంచి ఒక్కో జిల్లాలో ఇద్దరు, ముగ్గురు నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. నేతలు ఇప్పటికే పైరవీలు మొదలు పెట్టారు. సామాజిక సమీకరణాల దృష్ట్యా ఎంపికలు ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం.