News February 27, 2026
రైల్వే టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చొచ్చు!

కన్ఫర్మ్ అయిన రైలు టికెట్‌పై ప్రయాణించే వ్యక్తి పేరును మార్చుకునే వెసులుబాటును రైల్వే కల్పిస్తోంది. మీ టికెట్‌ను మీ నాన్న, అమ్మ, బ్రదర్, సిస్టర్, కొడుకు, కూతురు లేదా భార్యాభర్తల పేరు మీదకు మార్చుకోవచ్చు. దీనికోసం ప్రయాణానికి 24 గంటల ముందే టికెట్, ID ప్రూఫ్‌తో రిజర్వేషన్ ఆఫీసర్‌ను కలవాలి. ప్రభుత్వ ఉద్యోగులు, స్టూడెంట్స్, పెళ్లి బృందాలకు కూడా ఈ ఛాన్స్ ఉంది. ఈ మార్పు ఒక్కసారి మాత్రమే కుదురుతుంది.
Similar News
News February 28, 2026
విజయ్‌కు దెబ్బ మీద దెబ్బ!

తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి గడ్డుకాలం ఎదురవుతోంది. తొలుత కరూర్ తొక్కిసలాటలో 41 మంది చనిపోవడంతో ఆయనపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. దానిపై సీబీఐ ఎంక్వైరీ జరిగింది. తన చివరి చిత్రం ‘జననాయగన్’ సెన్సార్ సర్టిఫికెట్ కారణంగా విడుదల కాలేదు. ఎప్పుడవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. తాజాగా విజయ్ భార్య విడాకులు కావాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
News February 27, 2026
ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ గెలుపు

T20WC: కొలంబోలో NZతో జరిగిన ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జట్టు కీలక దశలో వికెట్లు కోల్పోవడంతో సాధించాల్సిన రన్‌రేట్ 14+కు చేరింది. ఈ క్రమంలో విల్ జాక్స్(32*) NZ బౌలర్లపై విరుచుకుపడ్డారు. సిక్సులు, బౌండరీలతో జట్టును విజయతీరాలకు చేర్చారు. అహ్మద్(19*) సైతం మెరుపులు మెరిపించారు. 18వ ఓవర్లో 22, 19వ ఓవర్లో 16 రన్స్ రావడం ఇంగ్లండ్‌కు కలిసొచ్చింది.
News February 27, 2026
కాంగ్రెస్ నిరసనలకే పరిమితమైంది: పీఎం మోదీ

1984 నుంచి కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతూ వస్తోందని.. ఇప్పుడు నిరసనలకే పరిమితమైందన్నారు పీఎం మోదీ. ఆర్టికల్ 370 రద్దు, CAA, ట్రిపుల్ తలాక్ రద్దు, UPI, స్వచ్ఛభారత్, కరోనా వ్యాక్సిన్.. ఇలా సంస్కరణలు అన్నింటినీ వ్యతిరేకించిందన్నారు. ప్రతిపక్షం అంటే విమర్శలే కాదని, ప్రత్యామ్నాయ విజన్ చూపాలని హితవు పలికారు. కాంగ్రెస్‌కు మిలీనియల్స్ బుద్ధి చెప్పారని.. ఇప్పుడు జెన్‌జీలు సిద్ధంగా ఉన్నారన్నారు.


