News October 24, 2025
రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష

రాష్ట్రంలో కీలక రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై రైల్వే ఉన్నతాధికారులతో శుక్రవారం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ భేటీ అయ్యారు. నర్సాపురం-కోటిపల్లి, నర్సాపురం-మచిలీపట్నం పెండింగ్ రైల్వే ప్రాజెక్ట్ పనులపై సమీక్షించారు. నర్సాపురం – అరుణాచలం ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్ చేయాలన్నారు. నరసాపురం-వారణాసి కొత్త రైలుకు కీలక ప్రతిపాదన, వందే భారత్‌కు తాడేపల్లిగూడెంలో హాల్ట్ ఇవ్వాలన్నారు.
Similar News
News October 25, 2025
రెగ్యులర్ SSC విద్యార్థులకు ఓపెన్ స్కూల్ ఆఫర్

ఏపీ ఓపెన్ స్కూల్ 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో ప్రవేశించేందుకు ఓపెన్ స్కూల్ సొసైటీ అమరావతి అవకాశం కల్పిస్తూ ప్రకటనను శుక్రవారం విడుదల చేసింది. ఓల్డ్ సిలబస్‌లో పదో తరగతి ఫెయిలైన వారు రూ.300లు చెల్లించి ఈనెల 31 లోపు అడ్మిషన్స్ పొందాలని డీఈఓ నారాయణ తెలిపారు. జిల్లాలో రెగ్యులర్ SSC ఫెయిల్ అయిన వారు 1,130 మంది ఉన్నారన్నారు. వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News October 25, 2025
తణుకు డిపో నుంచి ప్రత్యేక బస్సులు: DM

కార్తీక మాసం సందర్భంగా తణుకు డిపో నుంచి రాష్ట్రంలోని పలు పుణ్య క్షేత్రాలు, విహార యాత్రలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తణుకు RTC డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ శుక్రవారం తెలిపారు. పంచారామాలకు అక్టోబర్ 26, నవంబర్ 2, 9, 16 తేదీలలో రాత్రి 8 గంటలకు బస్సులు బయలుదేరుతాయన్నారు. కార్తీక సోమవారం దర్శనాల అనంతరం తిరిగి తణుకు చేరుతాయని చెప్పారు.
News October 25, 2025
డిగ్రీ ఫెయిలైన విద్యార్థులకు మరో అవకాశం

డిగ్రీ ఫెయిలైన విద్యార్థులకు మరో అవకాశం కల్పించినట్లు డీఎన్ఆర్ డిగ్రీ ప్రిన్సిపల్ జి.మోజెస్ శుక్రవారం తెలిపారు. 2001-20 మధ్య కాలంలో డిగ్రీ ఫెయిలైన అభ్యర్థులకు యూనివర్సిటీ మరో అవకాశం కల్పించిందన్నారు. పరీక్ష ఫీజు కట్టి, డిగ్రీ పూర్తి చేయడానికి యూనివర్సిటీ అవకాశం కల్పించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


