News March 5, 2025

రైల్వే స్టేషన్‌లలో వసతులపై లేఖ రాసిన MP వేమిరెడ్డి

image

నెల్లూరు జిల్లాలోని రైల్వే స్టేషన్ల పరిధిలో నెలకొన్న కనీస మౌలిక వసతులపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌‌కు లేఖ రాశారు. కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు రైల్వేస్టేషన్‌లో నీటి సమస్యలు, కావలి రైల్వే స్టేషన్‌ పరిధిలో చెత్త తరలింపు, వర్షాకాలంలో నీటి లీకేజీలు, ట్యాప్‌ కనెక్షన్లు, స్టేషన్‌ పరిధిలో బెంచీల ఏర్పాటు చేయాలని MP కోరారు.

Similar News

News March 5, 2025

ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలని వినియోగించుకోండి: జేసీ

image

రైతుల కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోళ్ల కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ కార్తీక్ పేర్కొన్నారు. బుధవారం బోగోలు మండలం చెంచులక్ష్మిపురంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ, సొసైటీ, సివిల్ సప్లై శాఖల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు.

News March 5, 2025

నెల్లూరు SE కీలక ఆదేశాలు

image

జిల్లాలోని విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు, సిబ్బంది పనితీరు మెరుగుపరచుకోవాలని జిల్లా విద్యుత్ SE వి. విజయన్ కోరారు. బుధవారం ఆయన కార్యాలయంలో జిల్లాల్లోని ఇంజనీరింగ్ అకౌంట్స్ విభాగం సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్ వినియోగదారులకు సంతృప్తికరమైన సేవలు అందించాలన్నారు. విద్యుత్ పోల్స్‌కు అల్లుకున్న తీగలను తొలగించి, నాణ్యమైన విద్యుత్‌ను అందించాలన్నారు.

News March 5, 2025

రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్

image

మనుబోలు మండలంలోని మనుబోలు రైతు సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూముల రీసర్వే ప్రక్రియ పర్యవేక్షణకు మనుబోలు మండలానికి వచ్చిన ఆయన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ధాన్యం తేమశాతం, కొనుగోలు కేంద్రం రికార్డులను పరిశీలించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

error: Content is protected !!