News March 4, 2025
రైళ్ల ద్వారా పెనుకొండ కియా కార్ల ఎగుమతి

పెనుకొండలోని కియా ఇండియా ప్లాంట్‌లో తయారైన కార్లు రైలు ద్వారా ఎగుమతి అవుతున్నాయి. మంగళవారం ఆ సంస్థ సెల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ జెండా ఊపి రైలును ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా డబుల్ డెక్కర్ రైలులో కార్లను మార్కెటింగ్ చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు రైల్వే ద్వారా 60 వేల కార్లను ఎగుమతి చేశామన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
Similar News
News December 13, 2025
కొండపి: తీవ్రంగా నష్టపోయిన పొగాకు రైతులు

కొండపి పొగాకు వేలంకేంద్రంలో కొనుగోళ్లు ముగిసినప్పటికీ రైతులకు తీవ్రస్థాయిలో నష్టం జరిగింది. సుమారు వేలం 9నెలల పాటు నిర్వహించడంతో పండించిన పొగాకు నాణ్యత కోల్పోయి ఆశించినంత మేర ధరలు రాక రైతులు నష్టాల బాట పట్టారు. బోర్డ్ అధికారులు రైతులకు సగటు ధర ఇప్పించడంలో విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఒక్కో బ్యారర్‌కు రూ.2లక్షల పైబడి నష్టం వాటిలినట్లు రైతులు వాపోతున్నారు.
News December 13, 2025
15న విశాఖలో వైసీపీ కోటి సంతకాల ర్యాలీ: కేకే.రాజు

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా YCP నిర్వహించిన కోటి సంతకాల కార్యక్రమానికి పలు వర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ లభించిందని జిల్లా అధ్యక్షుడు కేకే.రాజు అన్నారు. శనివారం YCP కార్యాలయంలో నేతలతో సమావేశమయ్యారు. డిసెంబర్ 15న GVMC గాంధీ విగ్రహం నుంచి మద్దిలపాలెం జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్లన్నున్నట్లు తెలిపారు. కోటి సంతకాల ప్రజా ఉద్యమం వినతి పత్రాలను తాడేపల్లికి ఆరోజు పంపనున్నట్లు చెప్పారు.
News December 13, 2025
వనపర్తి: రెండో విడత ఎన్నికలకు భారీ భద్రత: ఎస్పీ

వనపర్తి జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం 1,150 మంది పోలీసులతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. ఆదివారం 94 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయని ఆమె పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో సెక్షన్ 144 అమల్లో ఉంటుందని, ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని ఆమె ఆదేశించారు.


