News June 25, 2024
రైళ్ల రద్దు.. ఉద్యోగులు, విద్యార్థుల అవస్థలు
విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే రూట్‌లో పలు రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు నానావస్థలు పడుతున్నారు. ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, రాజమండ్రి స్టేషన్లకు సుమారు 200 మంది ఉద్యోగులు సీజన్ టికెట్లు తీసుకుని రోజువారీ విధులకు వెళ్లొస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాత్కాలికంగానైనా విజయవాడ నుంచి రాజమండ్రి వరకు ఒక ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ నడపాలని ఉద్యోగులు కోరుతున్నారు.
Similar News
News November 28, 2024
ఏలూరు: ఫెంగల్ తుఫాన్.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఫెంగల్ తుఫాన్ నేపథ్యంలో అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశామని జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ సాల్మన్ రాజు బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు శాఖ పరంగా సిద్ధంగా ఉన్నారన్నారు. ఏలూరు విద్యుత్ భవన్ నందు 24 గంటలు పనిచేసే విధంగా నెం. 9440902926 తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసామన్నారు. కావున ప్రజలు ధైర్యంగా ఉండాలన్నారు.
News November 27, 2024
ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తాం: జేసీ
తుఫాను భయంతో ముందస్తు కోతలు, నూర్పిడి చేయొద్దని జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి రైతులకు సూచించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని భరోసానిచ్చారు. జిల్లా బుధవారం జిల్లాలోని మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. తుఫాను హెచ్చరికల విషయమై రైతులెవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. రైతులకు అండగా ఉండాలని అధికారులకు సూచించారు.
News November 27, 2024
ఓం బిర్లాను కలిసిన RRR
దేశ రాజధాని ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణమ రాజు(RRR) మర్యాదపూర్వకంగా కలిశారు. పలు రాజకీయ విషయాలు పంచుకున్నారు. RRR వెంట ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఉన్నారు.