News October 22, 2025

రైళ్ళ రాకపోకలు ఆలస్యం: SCR

image

పలు రైళ్ల రాకపోకలు ఆలస్యంగా నడవనున్నట్లు SCR పేర్కొంది.
T.No.12722 HYD దక్షిణ్ 10.30Hrs
T.No.12648 కొంగు SF 2.40Hrs
T.No.12628 కర్ణాటక SF 9.45Hrs
T.No.12486 నాందేడ్ SF 10Hrs
T.No.12804 స్వర్ణ జయంతి SF రైళ్లు కొన్ని గంటల పాటు నేడు PDPL మీదుగ ఆలస్యంగా నడవనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. అయితే, రైల్వే ప్రయాణికులు గమనించాలని ఓ ప్రకటనలో సూచించారు.

Similar News

News October 22, 2025

రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు: అదనపు కలెక్టర్

image

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. మదనాపూర్, పాలెంలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్ 2025-26 సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు సన్న, దొడ్డు రకం వరి ధాన్యాన్ని గుర్తించడంలో తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలన్నారు.

News October 22, 2025

కామారెడ్డి జిల్లాలో రవాణా శాఖ చెక్‌పోస్టులు రద్దు

image

రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లాలోని అన్ని రవాణా శాఖ చెక్‌పోస్టులను ఎత్తివేశారు. జిల్లాలోని పొందుర్తి, మద్నూర్ చెక్‌పోస్టులు బుధవారం నుంచి తొలగించినట్లు జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇకనుండి వాహనాలను ఎక్కడా ఆపకుండా నేరుగా వెళ్లవచ్చని ఆయన వాహనదారులకు సూచించారు.

News October 22, 2025

గాయిటర్ గురించి తెలుసా?

image

థైరాయిడ్‌ గ్రంథి అసాధారణ సైజుకు పెరగడాన్ని గాయిటర్‌ అంటారు. ఇది రెండు రకాలు. థైరాయిడ్‌ గ్రంథి ఉబ్బడాన్ని డిఫ్యూస్‌ గాయిటర్‌ అని, థైరాయిడ్‌ గ్రంథిలో గడ్డలు పెరిగితే నాడ్యులార్‌ గాయిటర్‌ అని అంటారు. గొంతు దగ్గర బాగా ఉబ్బినట్లుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. కొందరిలో మాత్రం థైరాయిడ్‌ హార్మోన్ల స్రావంలో హెచ్చుతగ్గులు వస్తాయి. నిర్ధారణ కోసం థైరాయిడ్‌ ప్రొఫైల్‌ పరీక్షలైన T3, T4, TSH, NFAC చేస్తారు.