News July 23, 2024
రైస్‌మిల్లు మాధవ రెడ్డి ఇంట్లో తనిఖీలు

మదనపల్లె రైస్‌మిల్లు మాధవ రెడ్డి ఇంట్లో రెవెన్యూ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మంత్రిని అడ్డుపెట్టుకొని ఆర్డీవో సహకారంతో మదనపల్లె డివిజన్‌లో రూ.కోట్ల విలువైన భూములను కైవసం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దగ్ధంలో కూడా ఆయన పాత్ర ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.
Similar News
News February 15, 2026
కుప్పం: ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నా సిలిండర్ కొనాల్సిందే..!

కుప్పం GH లో 2 ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నా ఆసుపత్రి వారు మాత్రం ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతోంది. కరోనా సమయంలో కుప్పం GH కు NTR ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ ప్లాంటును అందజేశారు. అయితే అప్పటి YCP ప్రభుత్వం సైతం మరో ఆక్సిజన్ ప్లాంటును ఏర్పాటు చేసింది. 2 ఆక్సిజన్ ప్లాంట్లు నిర్వహణ లోపంతో మరమ్మతులు కాగా సుమారు ఏడాదికి పైగా ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేస్తున్నారు.
News February 15, 2026
చిత్తూరు జిల్లా ప్రజలకు గమనిక

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటామన్నారు. Meekosam.ap.gov.inలోనూ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. డయల్ 1100 కాల్ చేసి చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.
News February 15, 2026
చిత్తూరు జిల్లాలో రేపు సెలవు.. కానీ!

మహా శివరాత్రి సందర్భంగా చిత్తూరు జిల్లాలోని స్కూళ్లకు సోమవారం ఆప్షన్ హాలిడే ఇస్తున్నామని డీఈవో రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. పాఠశాలలకు సెలవు ఉన్నప్పటికీ.. టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని ఆదేశించారు. హెచ్ఎంలు, సబ్జెక్టు టీచర్లు కచ్చితంగా పాఠశాలకు హాజరై టెన్త్ విద్యార్థులకు పరీక్షలు పెట్టాలని సూచించారు.


