News January 5, 2026

రైస్ కింగ్‌గా భారత్.. కానీ!

image

152 మి.మె. టన్నుల వరి ఉత్పత్తితో చైనాను దాటేసి భారత్ <<18748404>>నంబర్‌-1<<>>గా నిలిచింది. అయితే ఇది ఘనతగా చెప్పుకోవడం కరెక్టేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే KG రైస్ ఉత్పత్తికి INDలో 3-4వేల లీటర్ల నీరు అవసరం. ఇది ప్రపంచ సగటు కంటే 20-60% ఎక్కువ. పైగా వరి ఉత్పత్తి ఖర్చు ఏటా భారీగా పెరుగుతోంది. వీటికి బదులుగా మిల్లెట్స్ వంటి తక్కువ నీటి వినియోగ పంటలపై దృష్టిసారించాలని నిపుణులు సూచిస్తున్నారు. మీరేమంటారు?

Similar News

News February 13, 2026

PMO ఇకపై సేవా తీర్థ్.. ప్రారంభించిన మోదీ

image

ఢిల్లీలో కొత్తగా నిర్మించిన సేవా తీర్థ్ కాంప్లెక్స్‌ను PM మోదీ ప్రారంభించారు. దీంట్లో PMOతో పాటు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్, క్యాబినెట్ సెక్రటేరియట్‌కు సంబంధించిన ఆఫీసులుంటాయి. ఇక నుంచి PMOను సేవా తీర్థ్‌గా పిలుస్తారు. సెంట్రల్ సెక్రటేరియట్‌కు కర్తవ్య భవన్‌గా నామకరణం చేశారు. గతంలో ఇవన్నీ సెంట్రల్ విస్టా పరిధిలో వివిధ ప్రాంతాల్లో ఉండేవి. దీనివల్ల పరిపాలనాపరమైన ఆలస్యం చోటు చేసుకునేది.

News February 13, 2026

కీలకం కానున్న MLA, MLC, MPల ఓట్లు

image

TG: మున్సి‘పోల్స్’ ఫలితాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటాపోటీగా ఉన్న చోట్ల ఛైర్మన్, మేయర్ ఎంపికలో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా MLA, MLC, MPల ఓట్లు కీలకం కానున్నాయి. రాజ్యసభ సభ్యులు, MLCలు రాష్ట్రంలో ఎక్కడైనా తమ ఓటు వినియోగించుకొనేందుకు ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. అదే లోక్‌సభ సభ్యులు, MLAలు తమ నియోజకవర్గ పరిధిలోని ఏదో ఒక మున్సిపాల్టీలో మాత్రమే ఓటేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

News February 13, 2026

నీళ్లపై చర్చలకు మేము సిద్ధం: చంద్రబాబు

image

AP: నీటి సమస్యపై 2 తెలుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునేలా ఉండాలని CM CBN స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను AP అడ్డుకుంటోందన్న TG CM రేవంత్ వ్యాఖ్యలపై అసెంబ్లీలో చంద్రబాబు స్పందించారు. ‘APలోని నల్లమల సాగర్‌ను TG అడ్డుకోవడం సరికాదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మేం సపోర్ట్ చేశాం. 5000 TMCల గోదావరి నీరు వృథాగా పోతోంది. కృష్ణాలోనూ నీటి వృథా ఉంది. సమస్యలపై చర్చకు మేము సిద్ధం’ అని పేర్కొన్నారు.