News January 24, 2026

రొంపిచర్ల: ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న మిస్సింగ్ యువతి

image

రొంపిచర్ల R బెస్తపల్లిలో మూడో రోజుల క్రితం మిస్సయిన తేజశ్రీ(20) అనే యువతి తను ప్రేమించిన యువకుడు యోగేంద్ర రెడ్డి (24)ని పెళ్లి చేసుకుందని రొంపిచర్ల ఎస్సై మధుసూదన్ తెలిపారు. వీరు భాకరాపేట సమీపంలోని దేవరకొండ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇద్దరు నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారని చెప్పారు. మేజర్లు కావడంతో ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు.

Similar News

News January 27, 2026

CM చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారు

image

CM చంద్రబాబు కుప్పం నియోజకవర్గ పర్యటన ఖరారైంది. ఈనెల 30, 31న ఆయన పర్యటించనున్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. TDP శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అదేవిధంగా కుప్పంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. పర్యటనకు సంబంధించి చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఇవాళ కుప్పంలో అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.

News January 27, 2026

గురుకుల ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

image

రామకుప్పం Dr.BR అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రజనీ కుమార్ తెలిపారు. 5వ తరగతిలో 80 సీట్లు, Jr inter MPC లో 40, Bipc లో 40, 6 నుంచి 10వ తరగతి వరకు మిగులు సీట్లకు అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరింత సమాచారం http://apgpcet.apcfss.in ను సంప్రదించాలన్నారు.

News January 26, 2026

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన SP

image

చిత్తూరు క్యాంపు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ రిపబ్లిక్ డే పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని సోమవారం ఆవిష్కరించారు. పోలీసు సిబ్బంది గౌరవ వందనం చేశారు. సిబ్బందికి ఆయన రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మురళీమోహన్, ఎంటీఓ వీరేశ్ పాల్గొన్నారు.