News March 26, 2025
రొంపిచర్ల : విద్యార్థుల నమోదు కోసం పోటా పోటీ ప్రచారం

విద్యార్థులను తమ పాఠశాలలో చేర్పించండంటూ ప్రభుత్వ ఉన్నత పాఠశాల టీచర్లు రొంపిచర్ల మండలంలో పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. 6 తరగతిలో పిల్లలను నమోదు చేసుకునేందుకు 5 తరగతి చదువుతున్న పిల్లలను కలిసి ప్రభుత్వ స్కూల్లో చేరమని కోరుతున్నారు. మరోపక్క ఏపీ మోడల్ స్కూల్ టీచర్లు కూడా ప్రచారం ముమ్మరం చేస్తూ ఇంటింటికి వెళ్లి పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను టీచర్లు అభ్యర్థిస్తున్నారు.
Similar News
News March 27, 2025
పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అప్పుడేనా..?

మద్యం కేసులో MP మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరుగుతోంది. ముందస్తు బెయిల్ కోసం ఆయన కోర్టుకు సైతం వెళ్లారు. ఈక్రమంలో ఆయన లాయర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏప్రిల్ 3 వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఆ తర్వాత చికిత్స పొందుతున్న తన తండ్రి పెద్దిరెడ్డిని పరామర్శించడానికి వెళ్తారు’ అని ఆయన చెప్పారు. ఆ వెంటనే MPని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన అనుచరుల్లో ఆందోళన నెలకొంది.
News March 27, 2025
చిత్తూరు జిల్లాలో నేడే ఎన్నికలు.. క్షణం క్షణం ఉత్కంఠ

చిత్తూరు జిల్లా పరిధిలోని రామకుప్పం, తవణంపల్లె, సదుం, విజయపురం(వైస్ MPP), పెనుమూరు (కో-ఆప్షన్ సభ్యులు)లలో నేడు ఎన్నికలు జరగనున్నాయి. అటు YCP, ఇటు కూటమి ఈ ఎన్నికలకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా రామకుప్పంలో కూటమికి బలం లేకున్నా సభ్యులను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ YCP నేతలు ఆరోపించారు. తవణంపల్లెలో సైతం ఇరు వర్గాలు పోటాపోటీగా ఉన్నాయి. సదుం MPP ఎన్నికపై సైతం ఉత్కంఠ నెలకొంది.
News March 27, 2025
చిత్తూరు: వెబ్ సైట్‌లో టీచర్ల సీనియారిటీ జాబితా

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ టీచర్ల జనరల్ సీనియారిటీ జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు డీఈఓ వరలక్ష్మి వెల్లడించారు. జిల్లాలో పని చేస్తున్న హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్లు.. జనరల్ సీనియారిటీ జాబితాను సరిచూసుకోవాలన్నారు. అభ్యంతరాలపై 29వ తేదీలోపు డీఈఓ కార్యాలయంలో తెలియజేయాలన్నారు.