News August 4, 2024
రొంపిచర్ల: స్నేహితుల దినోత్సవం రోజున విషాదం

రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామంలో స్నేహితుల దినోత్సవం రోజున విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రోహిత్ హైదరాబాదులో ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే శనివారం వీకెండ్ కావడంతో అదే గ్రామానికి చెందిన బాల అనే స్నేహితుడితో బైకుపై హైదరాబాదుకు వెళ్లాడు. కేబుల్ బ్రిడ్జిపై నుంచి వస్తున్న క్రమంలో రాత్రి సమయంలో బ్రిడ్జి పైన డివైడర్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు.
Similar News
News February 11, 2026
GNT: శివరాత్రి ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని శివాలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. దేవదాయ, రెవెన్యూ, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గత ఏడాది కంటే మెరుగ్గా ఏర్పాట్లు ఉండాలని, భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News February 11, 2026
బడ్జెట్ సమావేశాల్లో గుంటూరు గళం వినిపించనుందా?

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానుండటంతో గుంటూరు జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళం విప్పేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలో ఇద్దరు కీలక మంత్రులు ఉండటంతో పెండింగ్ నిధులు మంజూరవుతాయని ఆశలు వ్యక్తమవుతున్నాయి. సాగునీరు, తాగునీటి సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, డ్రైనేజ్, వీధి కుక్కల నియంత్రణ, ఆసుపత్రులు, రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
News February 11, 2026
సేవా రంగంలో గుంటూరు టాప్.. మిగతావాటిలో వెనుకబాటు

సేవా రంగంలో గుంటూరు జిల్లా 97 స్కోరుతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి ‘A+’ గ్రేడ్ సాధించింది. కానీ, టీనేజ్ గర్భధారణల్లో (8-10%) జిల్లా ఆందోళనకర స్థాయిలో ఉండటం గమనార్హం. పదో తరగతి అసెస్‌మెంట్‌లోనూ విద్యార్థులు C, D గ్రేడ్లకే పరిమితమయ్యారు. మరోవైపు, రైల్వే బ్రిడ్జిల (ROB) పనులు నత్తనడకన సాగుతున్నాయి. భూసేకరణ సమస్యలతో జాప్యం జరుగుతోంది. వీటిపై దృష్టి సారించకపోతే ఇబ్బందులు తప్పవు.


