News December 10, 2025
రొయ్యల పరిశ్రమల్లో కూలీలకు భద్రత: కలెక్టర్

రొయ్యల పరిశ్రమల్లో పనిచేస్తున్న మహిళల సంక్షేమం, భద్రత కొరకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. రొయ్యల సినర్జీ ప్రాజెక్టులో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాల కొరకు మత్స్య, కార్మిక శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ప్రచార యాత్ర వాహనాన్ని జిల్లా కలెక్టర్ బుధవారం జెండా ఊపి ప్రారంభించారు.
Similar News
News December 12, 2025
ఆసిఫాబాద్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత ఎన్నికలు

ఆసిఫాబాద్ జిల్లాలో పంచాయతీ తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసుల కృషి విలువైందని ఎస్పీ నితికా పంత్ తెలిపారు. లింగాపూర్, సిర్పూర్(యు), కేరమేరి, వాంకిడి, జైనూర్ అటవీ ప్రాంతాల్లో స్పెషల్ పార్టీలు విస్తృతంగా ఏరియా డామినేషన్, ఫుట్ డ్రిల్ చేపట్టాయి. 114 పోలింగ్ కేంద్రాల్లో 53 సెన్సిటివ్‌గా గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.
News December 12, 2025
ఏలూరు: ‘కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ కార్యక్రమం’

రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన సివిల్, ఏఆర్ & ఏపీఎస్పీ విభాగాలకు చెందిన పురుష, మహిళా కానిస్టేబుల్ అభ్యర్థుల శిక్షణా కార్యక్రమం నిర్వహణపై ఏలూరులో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సూర్య చంద్రరావు పాల్గొని మాట్లాడారు. శిక్షణ పొందిన కానిస్టేబుళ్లు ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ, వారికి పోలీస్ శాఖ ద్వారా మెరుగైన సేవలు అందించే విధంగా తయారు చేయాలన్నారు.
News December 12, 2025
862 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు: ASF SP

ఆసిఫాబాద్ జిల్లాలో రెండో విడతలో జరగనున్న పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ASF SP నితికా పంత్ పేర్కొన్నారు. 862 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటుహక్కు వినియోగించాలని సూచించారు. ఎవరైనా గొడవలకు ప్రేరేపిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసరాల్లో డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు.


