News March 14, 2025

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించండి: కలెక్టర్

image

రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ జిల్లా జి. రాజకుమారి వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం పాణ్యం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడ సిబ్బంది పనితీరు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, రోగుల సదుపాయాల గురించి పరిశీలించారు. ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా స్టాక్ పూర్తికాక ముందే ఇండెంట్ చేసి మందులను తెప్పించుకోవాలన్నారు.

Similar News

News February 26, 2026

పాడి పశువులను అలా కట్టేసే ఉంచుతున్నారా?

image

చాలా మంది పాడి రైతులు పశువులను రోజంతా అలా కట్టేసి ఉంచుతారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు వెటర్నరీ నిపుణులు. దీని వల్ల వాటికి గాయాలు కావడంతో పాటు మానసిక ఒత్తిడికి గురవడంతో పాటు క్రమంగా దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరుగుతుందని అంటున్నారు. వాటిని కచ్చితంగా ఉదయం, సాయంత్రం కాసేపు నడిపించాలని సలహా ఇస్తున్నారు. వాటి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, పశువులకు రోజూ స్నానం చేయించాలని సూచిస్తున్నారు.

News February 26, 2026

రాష్ట్రంలో 250 పోస్టులు.. అప్లై చేశారా?

image

ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్‌లో 250 అప్రెంటిస్ పోస్టులకు NATS పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవడానికి ఇవాళే ఆఖరు తేదీ. TG ట్రాన్స్‌కోలో రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు. BE/BTech(EEE, ECE, CSE, మెకానికల్, సివిల్, IT), డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు స్టైపెండ్ రూ.17,500, డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ.15,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://tgtransco.com

News February 26, 2026

తూ.గో: కలుషిత పాలు.. ప్రాణాలను కాపాడే ‘ఇంజెక్షన్’ వస్తోంది!

image

కలుషిత పాలు తాగి అస్వస్థతకు గురైన వారి కోసం ముంబై నుంచి ప్రత్యేకంగా ‘ఫోమెబెస్ట్’ యాంటీడోట్ తెప్పిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం వెల్లడించారు. నెఫ్రాలజిస్ట్ డా.రవి రాజు సూచనల మేరకు రోగులకు ఈ ఇంజెక్షన్లు ఇస్తామన్నారు. ఈ మందు మన రాష్ట్రంలో అందుబాటులో లేకపోవడంతో అంతర్జాతీయ ఏజెన్సీల ద్వారా సేకరిస్తున్నట్లు తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.